Nadendla Manohar: ఆ స్కీం లో రూ.120 కోట్లు మాయం.. జగన్ సర్కార్ పై నాదెండ్ల సంచలన ఆరోపణలు ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న విద్యాకానుక పథకంలో రూ.120 కోట్లు దారి మళ్లాయని జనసేన నేత నాదేండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో 35 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. జగనన్న విద్యా కానుక కోసం 42 లక్షల ఆర్డర్లు ఇచ్చారన్నారు. By Nikhil 14 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి వైసీపీ ప్రభుత్వంలో (YCP Government) సాగుతున్న కుంభకోణాలు అక్రమాలపై రోజుకొకటి చొప్పున బయట పెడతామని జనసేన (Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వారం క్రితం ప్రకటించారు. అందులో భాగంగా విద్యా శాఖలో స్కామ్ వివరాలను ఈ రోజు వెల్లడించారు. ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యాకానుకలో రూ.120 కోట్లు దారి మళ్లాయని ఆయన ఆరోపించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 5 కంపెనీలపై దాడులు చేసిందన్నారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలో తీగ లాగితే ఏపీలో డొంక కదిలిందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి మీదుగా రాయలసీమకు ఇవి చేరాయా? అని ప్రశ్నించారు. నిధులు ఎలా దారి మళ్లాయి.. అనే అంశంపై ఈడీ సమగ్ర విచారణ మొదలుపెట్టిందన్నారు. మొత్తం 5 కంపెనీలు సిండికేట్ గా మారాయి అనేది అర్థం అవుతోందన్నారు. ఇది కూడా చదవండి: TDP-AP CID: టీడీపీకి షాక్ ఇచ్చిన సీఐడీ.. ఆ వివరాలు ఇవ్వాలని నోటీసులు విద్యార్థులకు నాసిరకం బూట్లు, చిరిగిపోతున్న బ్యాగులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు నాదెండ్ల. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలు లాలూచీపడ్డారు. ఇప్పటి వరకూ జగనన్న విద్యా కానుక పేరుతో రూ.2400 కోట్లు నిధులు వెచ్చించారన్నారు. ఈ 5 కంపెనీలు వెనక ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. పేద విద్యార్థుల పేరుతో కోట్లు దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. జగనన్న విద్యా కానుక కోసం ఆర్డర్ పెట్టింది 42 లక్షలు అని అన్నారు. ఈ వ్యత్యాసంలో ఉన్న మొత్తం ఎటు పోతుంది? అని ప్రశ్నించారు. JanaSena Party PAC Chairman Shri @mnadendla Press Meet at Mangalagiri Live Link: https://t.co/l2FawxYavu — JanaSena Party (@JanaSenaParty) November 14, 2023 ఆ శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం పెద్ద మాటలు చెబుతూ క్వాలిటీ వాల్ అని విద్యార్థులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. గోడ మీద చూపించే వాటికి విద్యార్థులకు ఇచ్చే బూట్లు, బ్యాగులకు సంబంధం లేదన్నారు. ఎడమ కాలుకు 3వ నెంబర్ సైజ్, కుడి కాలుకు 5వ నెంబర్ సైజ్ షూస్ ఇస్తున్నారని మండిపడ్డారు. క్లాస్ వార్ అని చెప్పే జగన్ పేద విద్యార్థుల పేరుతో కోట్లు మళ్లిస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. #janasena #ap-cm-jagan #nadendla-manohar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి