JAMMU AND KASHMIR: ఉగ్రవాదం పై అమిత్ షా జీరో టెర్రర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మిలిటెన్సీ దెబ్బతిన్నప్పటికీ, అది కొత్త మార్గాల్లో రూపుదిద్దుకుంది. ఎందుకంటే హైబ్రిడ్ మిలిటెన్సీ అస్త్రంగా ఉగ్రవాదులు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
JAMMU AND KASHMIR: ఉగ్రవాదం పై అమిత్ షా జీరో టెర్రర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

JAMMU AND KASHMIR: కశ్మీర్‌.. దశాబ్దాల రక్తపాతానికి సాక్ష్యం.. భారత్‌లో వీలినం నాటి నుంచే కశ్మీర్‌ ఓ సమస్యాత్మక ప్రాంతం..! అయితే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పరిస్థితి మారుతుందని.. మారిందని కేంద్రం అనేక సందర్భాలు చెప్పుకొస్తున్నా ఇప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు యాక్టివ్‌గానే కొనసాగుతున్నయన్న వాదన వినిపిస్తోంది. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులు, సామాన్యుల విషాద కథలు ఇంకా కళ్లకు కడుతూనే ఉన్నాయి. ఉగ్రవాదుల పీడనలోనే కశ్మీర్‌ ప్రజలు ఇంకా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత? అమిత్‌షా ప్రకటించిన జీరో టెర్రర్ ప్లాన్ అసలు వర్కౌట్ అవుతుందా? కశ్మీర్‌లో గ్రౌండ్‌ రియాల్టీపై ఆర్టీవీ స్పెషల్‌ స్టోరీ అందిస్తోంది!

2023 లెక్కల ప్రకారం కశ్మీర్‌ రీజియన్‌లో 91 మంది మిలిటెంట్లు యాక్టివ్‌గా ఉన్నారు. ఇందులో 61 మంది విదేశీ మిలిటెంట్లు, 30 మంది స్థానిక మిలిటెంట్లు. 2022 పోల్చితే మిలిటెంట్ల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. 2022లో మొత్తం 135 మంది మిలిటెంట్లు యాక్టివ్‌గా ఉన్నారని డేటా చెబుతోంది. కశ్మీర్‌లో మిలిటెన్సీ సంబంధిత కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. అయితే మునుపెన్నడూ లేని విధంగా జమ్ము ప్రాంతంలోని రాజౌరి- పూంచ్‌లో ఉగ్రవాదుల తిష్ట వేసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 15ఏళ్ల తర్వాత ఈ రెండు ప్రాంతాలు ఘోరమైన ఉగ్రవాద ఘటనలు చూస్తున్నాయి. గత 30 నెలల్లో ఒక్క పూంచ్‌లోనే 21మంది జవాన్లు చనిపోయారంటే జమ్ములో ఉగ్రవాదల కార్యకలాపాలు ఎలా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మిలిటెన్సీ దెబ్బతిన్నప్పటికీ, అది కొత్త మార్గాల్లో రూపుదిద్దుకుంది. ఎందుకంటే హైబ్రిడ్ మిలిటెన్సీ అస్త్రంగా ఉగ్రవాదులు పావులు కదుపుతున్నారు. వీరంతా దాడి చేసిన వెంటనే లేదా చంపిన వెంటనే వారి సాధారణ జీవితాలకు తిరిగి వెళ్లిపోతారు. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన యువకులపై ఉగ్రవాదుల నిఘా ఎప్పుడూ ఉంటుంది. వీరిలో అతివాదం ఎక్కువగా ఉన్న యువకులను కిరాయికి ర్రికూట్‌ చేసుకుంటారు ఉగ్రవాదులు. ఇచ్చిన పని చేసేసి తమ పనుల్లోకి వెళ్లిపోయే ఈ పార్ట్‌టైమ్‌ ఉగ్రవాదులను పట్టుకోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.

మరోవైపు 1989లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు ప్రారంభమైనప్పటి నుంచి కశ్మీర్‌లో వేలాది మంది పౌరులు చనిపోయారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతం కావడంతో, మృతుల్లో అత్యధికంగా ముస్లింలే ఉన్నారు. అయితే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయే సామాన్యుల సంఖ్య కూడా 2019 తర్వాత తగ్గింది. ఉగ్రవాద దాడుల్లో 2019లో మొత్తం 44 మంది పౌరులు మరణించగా, 2022 చివరి నాటికి వారి సంఖ్య 29కి తగ్గింది. ఇక జమ్ముకశ్మీర్‌లో 2023లో తొలిసారిగా స్థానిక ఉగ్రవాదుల కంటే ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. 2023లో భద్రతా బలగాల చేతిలో హతమైన 72 మంది ఉగ్రవాదుల్లో 50 మంది విదేశీయులే ఉన్నారు.

అటు ఉగ్రవాదుల దాడుల్లో మరణిస్తున్న జవాన్ల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. 2023లో జరిగిన 134 మిలిటెన్సీ-సంబంధిత హత్యలలో, పీర్ పంజాల్ ప్రాంతంలో 53 మంది మరణించారు. రాజౌరీ-పూంచ్‌ సరిహద్దు జిల్లాల్లో మరణించిన 53 మందిలో 19 మంది ఆర్మీ సిబ్బంది, అధికారులు ఉన్నారు. 2022లో 253 మిలిటెన్సీ సంబంధిత మరణాలను నివేదించింది. ఇందులో 30 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. వీరిలో కూడా ఎక్కువ మంది రాజౌరీ-పూంచ్‌ రీజియన్‌లో చనిపోయినవారే ఉన్నారు.

మొత్తంగా చూస్తే ఉగ్రవాదుల సంఖ్యను తగ్గించడంలో కేంద్రం సక్సెస్‌ సాధించిందనే చెప్పాలి. అదే సమయంలో జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాల కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటు అమిత్‌ షా ప్రకటించిన జీరో టెర్రర్‌ ప్లాన్‌ వర్కౌట్ అవుతుందా లేదా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఉగ్రవాదల జాబితాలో ఉన్నవారి ఏరివేత కొనసాగుతోంది కానీ హైబ్రిడ్ రిక్రూట్‌మెంట్లపై కేంద్రం కాస్త వెనుకంజలోనే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ రకమైన అతివాదమైనా ఉగ్రవాదానికి దారి తీయవచ్చు.. అది ఉగ్రవాద చర్యల్లో, దాడుల్లో వేగం పెరిగేలా చేస్తుంది. ఇది జమ్ముకశ్మీర్‌కు ఏ మాత్రం మంచిది కాదంటారు విశ్లేషకులు!

Also Read: Anushka Shetty: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్ 

Advertisment
Advertisment
తాజా కథనాలు