Jagan Bangalore Palace: బెంగళూరుకు జగన్.. జోరందుకున్న అక్కడి ప్యాలెస్ పై చర్చ

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా బెంగళూరు వెళ్లారు. దీంతో ఇప్పుడు అక్కడి జగన్ నివాసంపై కథనాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అక్కడ యలహంకలోని ప్యాలెస్ లాంటి జగన్ ఇంటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. 

New Update
Jagan Bangalore Palace: బెంగళూరుకు జగన్.. జోరందుకున్న అక్కడి ప్యాలెస్ పై చర్చ

Jagan Bangalore Palace: వైసీపీ అధినేత రెండురోజుల పులివెందుల పర్యటన పూర్తి చేసుకుని ఇప్పుడు బెంగళూరు వెళ్లారు. అక్కడ ఎన్నిరోజులు ఉంటారనేది ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఆయన బెంగళూరు వెళ్లారనే వార్త మాత్రం బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆయనకు అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లుంది. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్లడంతో అందరి దృష్టీ ఆ ఇంటి విశేషాల మీద పడింది. ఎందుకంటే, ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖపట్నం.. రుషికొండ పై నిర్మించిన ప్యాలెస్ (Rushikonda Palace) లాంటి భావంతులపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ అంటే మోజు అంటూ ప్రత్యర్ధులు విమర్శలు చేయడంతో పాటు.. సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ బెంగళూరు వెళ్లడంతో అక్కడి ఆయన నివాసం ఒక్కసారిగా ట్రేండింగ్ లోకి వచ్చింది. 

23 ఎకరాల్లో..
Jagan Bangalore Palace: బెంగళూరు నుంచి ఏపీ లేదా హైదరాబాద్ వచ్చే దారిలో బెంగళూరు ఎయిర్ పోర్ట్ దగ్గరలో ఈ ప్యాలెస్ ఉంటుంది. ఆ నివాసం ఉన్న ఏరియా పేరు యలహంక. అందుకే దీనిని యలహంక ప్యాలెస్ అని కూడా అక్కడి ప్రజలు పిలుస్తుంటారు. ఇది మొత్తం 23 ఎకరాల్లో (23 Acres) ఉంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి కుటుంబ నివాసం కోసం బిల్డింగ్స్, స్టాఫ్ క్వార్టర్స్, హెలిపాడ్ తో పాటు అన్ని ఆధునిక హంగులు ఏర్పాటు చేసుకున్నారని చెబుతారు. 

ఇంతవరకూ ఎవరూ చూడలేదు..
ఇంతవరకూ ఆ ప్యాలెస్ లోపల చూసి వచ్చినవారు లేరు కానీ.. కొందరు సోషల్ మీడియా నిర్వాహకులు బెంగళూరు ప్యాలెస్ అంటూ కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేశారు. వాటిని బట్టి చూస్తే సువిశాలమైన పెద్ద బిల్డింగ్స్ మూడు కనిపిస్తాయి. వాటి పక్కన కొద్దీ దూరంలో చిన్న బిల్డింగ్స్ ఉంటాయి. ఇక తోటలు ఒక పక్క.. మరో పక్క ఆధునికంగా ముస్తాబయింది హెలిపాడ్ ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ చూస్తే అత్యంత ఆధునికంగా.. ఈ ప్యాలెస్ నిర్మాణం చేపట్టినట్టు కనిపిస్తుంది. 

పట్టుమని పది రోజులు కూడా..
నిజానికి ఈ ప్యాలెస్ దివంగత నేత, వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండగా నిర్మించారు. అప్పట్లోనే విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ప్యాలెస్ పై విపరీతమైన విమర్శలు చేసింది. ఈ నివాసంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా గృహ ప్రవేశం చేశారు. కానీ, ఆ తరువాత ఆయన దురదృష్టవశాత్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో వైఎస్ జగన్ రాజకీయాల్లో చురుకుగా మారి.. వైసీపీ పార్టీ ప్రారంభించారు. ఇక ఆయన ఎప్పుడూ ఆ ప్యాలెస్ లో ఉండలేదు. అయితే, తరువాత చాలాకాలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తన కుటుంబంతో అక్కడ ఉండేవారు. 

100 కోట్ల పైమాటే..
జగన్ బెంగళూరు ప్యాలెస్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయల పైగానే ఖర్చు చేసినట్టు అప్పట్లో చెప్పుకునేవారు. ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రత్యర్ధులు ఈ ప్యాలెస్ కేంద్రంగా చాలా విమర్శలు చేసేవారు. అయితే, వాటిని వైఎస్ అభిమానులు చాలా వరకూ తిప్పి కొడుతూ ఉండేవారు. అప్పట్లో పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తులు చెప్పారంటూ నేషనల్ మీడియాలో ఒక కథనం వచ్చింది. దాని ప్రకారం.. ఆ 23 ఎకరాల స్థలం ఎస్కె నాయర్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. భారీ ఖర్చుతో అక్కడ ప్యాలెస్ లాంటి నిర్మాణం చేశారు. దాని నిర్మాణానికి అప్పట్లోనే 60 కోట్ల వరకూ ఖర్చయ్యాయని వార్తలు వచ్చాయి. 

అంతలేదు..
అయితే, వైఎస్ అభిమానులు.. పార్టీ నాయకులు మాత్రం అక్కడ స్థలం ఖరీదు 15 కోట్ల రూపాయల లోపు మాత్రమే అనీ.. ఆ తరువాత బిల్డింగ్ నిర్మాణానికి మరో 15 - 20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పేవారు. తమ ప్రత్యర్ధులు కావాలనే దుష్ట ప్రచారం చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చేవారు. 

ప్యాలెస్ ల గురించి కథలు . .
Jagan Bangalore Palace: ఆ ప్యాలెస్ వైభోగం గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునే వారు. ఇప్పుడు మరోసారి యాహలంక ప్యాలెస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకా.. తాడేపల్లిలో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా ఉండేలా చూసుకున్నారు. అయితే, ఆ బిల్డింగ్ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించే వారు కాదు. ఆయనను కలిసేవారు నేరుగా క్యాంప్ ఆఫీస్ కు వెళ్లడం.. అక్కడ నుంచి వెనక్కి వెళ్లడం అంతే. లోపల నిర్మాణాల గురించి బయట ఎవరికీ తెలీదు. పైగా అక్కడ రోడ్డు కూడా భద్రతా దళాలు సెక్యూరిటీ రీజన్స్ పేరుతొ క్లోజ్ చేశాయి. దీంతో తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పుకోవడమే జరిగేది. ఇటీవల కాలంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆ రోడ్డు బ్లాక్ తీయించేశారు. దీంతో చాలామంది అక్కడ వీడియోలు తీసి ఆ ప్యాలెస్ ను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. 

మొత్తంగా చూసుకుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటు తిరిగినా.. ప్యాలెస్ ల గురించే చెప్పుకోవడం జరుగుతోంది. ఏదిఏమైనా జగన్ బెంగళూరు పర్యటనతో మరోసారి అక్కడి ప్యాలెస్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. 

బెంగళూరులో జగన్ ప్యాలెస్ అంటూ చూపించిన వీడియో ఇది..

Advertisment
Advertisment
తాజా కథనాలు