Andhra Pradesh: ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం..పిచ్చ తిట్లు తిట్టుకుంటున్న అధినేతలు

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపార్టీల ప్రచారం కాక రేపుతోంది. నువ్వొకటంటే నేను రెండు అంటా అన్నట్లుగా దూషణభూషణల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు, జగన్ మాటల యుద్ధం ముదిరి ఈసీ వార్నింగ్ ఇచ్చే వరకూ వెళ్ళింది.

New Update
Andhra Pradesh: ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం..పిచ్చ తిట్లు తిట్టుకుంటున్న అధినేతలు

 Election campaign: ఆంధ్రప్రదేశ్ నెమ్మదిగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. అక్కడి ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇరు పార్టీల అధినేతలు కాలికి చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇక పార్టీని మరొకరు విమర్శించుకుంటూ ముందు దూసుకుపోతున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ ప్రచారంలో భాగంగా నేతలు చేసుకుంటున్నా దూషణలే కర్ణకఠోరంగా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ప్రచారం అంటే ఇలానే ఉండేది. నాయకులు ఒకరిని ఇంకొకరు విమర్శించుకునేవారు. కానీ ఇప్పుడు అది కాస్తా శు్రతి మించుతోంది. డైరెక్ట్‌గా తిట్టేసుకుంటున్నారు. దీనికి జనాలు కూడా బాగానే మద్దతు పలుకుతున్నారు. నేతలు తిట్టుకుంటుంటే చప్పట్లు కొడుతూ ప్రోత్పహిస్తున్నారు.

టీడీపీ, వైసీపీ అధినేతలు చంద్రబాబు, జగన్‌లు ఎన్నికల కోడ్ ఒకటుందనే విషయాన్నే పూర్తిగా మర్చిపోయారు. తగ్గేదేలే అంటూ దారుణంగా తిట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబులకు ఈసీ నోటీస్ కూడా ఇచ్చింది. జగన్ నీచుడు, రాక్షసుడు, దొంగ అని బాబు తిడుతుంటే...చంద్రబాబు సమాధి నుంచి లేచి వచ్చిన పశుపతి, రక్తం పీల్చేందుకు రెడీ అయ్యారని వివర్స్ అవుతున్నారు. అంతే కాకుండా చంద్రబాబు శాడిస్టు అని, పింఛన్లు ఆపిన పాతాత్ముడు అంటూ నోటికొచ్చినట్టు తిట్టారు జగన్. అంతేకాదు హంతకుడు, దుర్మార్గుడు అని కూడా అన్నారు. చంద్రబాబు అనే చంద్ర‌ముఖి.. ల‌క‌ల‌క‌ల‌క అంటూ మ‌ళ్లీ ఓట్ల కోసం ముందుకు వ‌చ్చింది అంటూ వ్యాఖ్యలు చేశారు. వీటి మీదనే ఈసీ సీరియస్ అయింది. జగన్‌ వీటికి సమాధానం చెప్పాలని కోరింది.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏమీ తక్కవు తినలేదు. ఆయన కూడా జగన్‌ను నోటికొచ్చినట్టు తిట్టారు. జగన్‌.. ప్రజల జీవితాలతో ఆడుకొనే ఓ జలగ అన్నారు. ఎన్నికల్లో బాబాయిని చంపి ఓట్లు అడిగారు. వైకాపాకు జగన్‌ గొడ్డలి గుర్తు పెట్టుకోవాలి అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉందని అన్నారు.

మొత్తానికి ఎన్నికల ప్రచారం పూర్తిగా హీట్ ఎక్కకుండానే ఇరు పార్టీల నేతలు హద్దులు దాటేస్తున్నారు. మధ్యలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా యాడ్ అవుతూ ఈ తిట్ల పురాణాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పుడ ఈసీ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అయినా నేతలిరువురూ తగ్గుతారో..లేదా ఎవరేం చేసుకుంటే నాకే అనుకుని ఇలానే తిట్లు తిటుకుంటారో చూడాలి.

Also Read:Heroins Fitness: నాజూగ్గా ఉండాలంటే..లక్షలు ఖర్చు పెట్టాల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు