IT Raids: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడి ఇంటిపై ఐటీ దాడులు.. 12 గంటలుగా సాగుతున్న సోదాలు హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు, వారి సన్నిహితుల నివాసాలే టార్గెట్ గా ఐటీ దాడులు 12 గంటలుగా కొనసాగుతున్నాయి. By Nikhil 02 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్ మహానగరంలో ఐటీ దాడులు (IT Raids) ఇంకా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ (Congress) నేతలే టార్గెట్ గా 12 గంటలుగా ఐటీ సోదాలు సాగుతున్నాయి. దాదాపు పది చోట్ల ఈ సోదాలు సాగుతున్నట్లు సమాచారం. బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (KLR) నివాసాలు, కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వీరితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తోడల్లుడు గిరిధర్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. కొన్ని గంటలుగా వారి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. తుక్కుగూడలో కేఎల్ఆర్ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలోనూ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ లోని కేఎల్ఆర్ ఫామ్ హౌజ్ లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో అక్కడికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. #it-raids #komatireddy-venkat-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి