Big Breaking: ఐటీ అధికారుల నిఘాలో నామినేషన్.. ఈసీకి పొంగులేటి కంప్లైంట్!

కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి ఐటీ అధికారులు నామినేషన్‌ వేసేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. పొంగులేటి వెంటే ఐటీ అధికారులు ఉండనున్నారు. ఖమ్మం రూరల్‌లోని రిటర్నింగ్‌ ఆఫీస్‌కు వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

New Update
Big Breaking: ఐటీ అధికారుల నిఘాలో నామినేషన్.. ఈసీకి పొంగులేటి కంప్లైంట్!

పొంగులేటి ఇంట్లో ప్రస్తుతం ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పొంగలేటికి నామినేషన్ వేసేందేకు అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు దీనికి తెరపడింది. పొంగులేటి నామినేషన్ దాఖలు చేసేందుకు ఐటీ అధికారులు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చారు. అంతేకాదు ఆయన వెంట ఐటీ అధికారులు కూడా ఉండనున్నారు. ఇక హైదరాబాద్‌ నుంచి ఖమ్మం రూరల్‌లోని రిటర్నింగ్‌ ఆఫీస్‌కు పొంగులేటి వెళ్లనున్నారు. అక్కడ నామినేషన్ దాఖల చేశాక మళ్లీ తిరిగి హైదరాబాద్ రానున్నారు.

మరోవైపు తనపై జరిగిన ఐటీ సోదాలను పొంగులేటీ తీవ్రంగా ఖండించారు. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నాని తెలిసి బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పూరిత కోణంలో నామినేషన్ అడ్డుకోవాలని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించారు. BRS, బీజేపీ ఫెవికాల్ బంధం ఏంటి అనేది ఈ వ్యవహారంతో బయట పడిందని అన్నారు. నామినేషన్‌ని అడ్డుకోవాలి అనుకోడం BRS+BJP ల ఓటమి భయాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కావాలనే తనను నామినేషన్‌ వేయకుండా ఇబ్బందులకు గురి చేశాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి దీనిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు..  ప్రస్తుతం పొంగులేటి నిలయం ఐటీ నిర్భంధంలోనే ఉంది. ఇక సాయంత్రం వరకు ఐటీ సోదాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు