AP News: ఏపీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం!

ఏపీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం, బుక్స్, పారిశుధ్యంపై నివేదిక ఇవ్వాలని సూచించారు.

New Update
AP News: ఏపీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం!

Nara Lokesh to Focus on AP Education System: ఏపీలో ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్థంతరంగా నిలిచిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తిచేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మధ్యాహ్నభోజన పథకం డైరక్టర్ అంబేద్కర్ కు లోకేష్ సూచించారు. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

సమగ్ర నివేదిక కావాలంటూ..
అదేవిధంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడీని ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని అన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాల ఎంత దూరంలో అందుబాటులో ఉంది అనే వివరాలతో నివేదిక రూపొందించాలని కోరారు. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని అన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ ను కూడా అందజేయాలని డైరెక్టర్ లైబ్రరీస్ ను ఆదేశించారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్ బి వినియోగం మీద సమగ్ర నోట్ ను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

తక్షణమే పాఠ్యపుస్తకాల పంపిణీ..
సీబీఎస్ఈ పాఠశాలల (CBSE Schools) మీద సమగ్ర నోట్ తో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే 82వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, అదే విధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోట్ ఇవ్వాలని మంత్రి లోకేష్ చెప్పారు. స్టూడెంట్ కిట్ ను అందించడాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ అందించాలని లోకేష్ గారు ఆదేశించారు. గత ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వకపోవడం పట్ల లోకేష్ ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని అధికారులతో అన్నారు. తక్షణమే పాఠ్యపుస్తకాల పంపిణీ కి ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.

నూతన విధానాన్ని అమలు చేయండి..
ఇంటర్ విద్యార్థుల కోసం ఈ నూతన విధానాన్ని అమలుచేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి, మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ గారు స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వం అమలుచేసిన పారదర్శక విధానాలను మళ్లీ తీసుకువస్తామని చెప్పారు. అదేవిధంగా పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారుచేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్, స్కూల్ ఇన్ ఫ్రా కమిషనర్ భాస్కర్ కాటమనేని, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ అంబేద్కర్, అడల్డ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి నిధి మీనా, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు.. వారిని దూరం పెట్టనున్న ప్రభుత్వం..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు