Summer : రోహిణి రాకముందే పగులుతున్న రోళ్లు...! గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.మార్చి మొదలైనప్పటి నుంచి కూడా రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇక ఈ ఏడాది మార్చి- మే నెలల మధ్య సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అయిపోయాడు. By Bhavana 26 Apr 2024 in Latest News In Telugu వాతావరణం New Update షేర్ చేయండి Summer : సాధారణంగా రోహిణి వస్తే రోళ్లు పగులుతాయనే నానుడి ఉంది.. కానీ ప్రస్తుతం ఉన్న ఎండ(Sun) లను చూస్తుంటే రోహిణి(Rohini) ఇప్పుడే వచ్చిందా అన్నట్లు కనిపిస్తుంది. ఈ ఏడాది ఎండలు జనవరి రెండో వారం నుంచే ఎండలు మండుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే రోహిణి ఎండలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక మార్చి మొదలైనప్పటి నుంచి కూడా రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇక ఈ ఏడాది మార్చి- మే నెలల మధ్య సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అయిపోయాడు. ఎల్‌నినో(LNINO) కారణంగా ఈ ఏడాది సూర్యుడు మరింత మండనున్నాడని వాతావరణశాఖ సంస్థలు తెలిపాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. ఉష్ణోగ్రతలు(Temperatures) సాధారణ స్థాయిని దాటి 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే ఆ పరిస్థితిని ‘సూపర్ ఎల్‌నినో’ అంటారు. ఉష్ణోగ్రతలకు మించి వేడి తీవ్రత ఉండటాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు ‘ఫీల్ లైక్ టెంపరేచర్’ అంటారు. గాలిలో తేమ శాతం తగ్గడమే దీనికి కారణమని, తద్వారా ఉక్కపోత ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వడదెబ్బ(Sunburn) మృతుల సంఖ్య ఈ సారి భారీగా పెరిగే ప్రమాదం ఉన్నట్టు హెచ్చరించారు. 2024 జూన్ నాటికి ఎల్‌నినో ప్రభావం క్షీణించి, పరిస్థితి సాధారణస్థితికి వస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. Also read: కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు! #summer #temperature #elnino #rohini-karthe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి