పాతబస్తీలోని ప్రముఖ వ్యాపారుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూరుస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
IT Raids In Hyderabad: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ అధికారులు రాష్ట్రంలో వరుసగా దాడులు చేస్తున్నారు. నిత్యం ఏదోక ప్రాంతంలో సోదాలు చేస్తున్న ఐటీ శాఖ తాజాగా నగరంలోని పాతబస్తీలోని బడా వ్యాపారులను టార్గెట్ గా దాడులు నిర్వహిస్తున్నారు. కింగ్ ప్యాలెస్ (Kings palace) యజమానులతో పాటు, కోహీనూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ (Majid Khan) ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
షానవాజ్ ఇంటితో పాటు పలువురి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. కోహినూర్ , కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న వీరు ఓ రాజకీయ పార్టీకి భారీగా నగదు సమకూర్చుతున్నట్లు సమాచారం రావడంతోనే ఐటీ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది మే నెలలో కూడా పాతబస్తీ తో పాటు దాని చుట్టుపక్కల 30 ప్రాంతాల్లో ఉన్న కోహినూర్ గ్రూప్ నకు చెందిన అన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేస్తుంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.