ISRO: విద్యార్ధులకు ఇస్రో బంపర్ ఆఫర్...అస్సలు మిస్ అవ్వద్దు.

విద్యార్ధుల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదార్ధుల్లో స్పేస్ సైన్స్ మీద ఆసక్తిని కలిగించేందుకు యువిక అనే కార్యక్రమాన్ని తీసుకు వస్తోంది. దీనికి తొమ్మిది..ఆపై తరగతుల వాళ్ళు అప్లై చేసుకోవచ్చని తెలిపింది.

New Update
ISRO: విద్యార్ధులకు ఇస్రో బంపర్ ఆఫర్...అస్సలు మిస్ అవ్వద్దు.

ISRO Young Scientist Programme Yuvika 2024: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచేందుకు ఇస్రో వైజ్ఞానిక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీనికి యువిక అని పేరు పెట్టింది. ఈ కార్యక్రమానికి తొమ్మిదవ తరగతి నుంచి విద్యార్ధులు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. మే నెలలో రెండు వారాలపాటూ దీన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ప్రోగ్రాం కోసం మార్చి 20లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇస్రో అధికారిక పోర్టల్‌లోని jigyasa.iirs.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. యంగ్ సైంటిస్ట్ స్కీమ్‌లో భాగంగా ఇస్రో దీన్ని నిర్వహిస్తోంది.

ఈ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిన విద్యార్ధులు ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళతారు. దీనిలో విద్యార్ధులు అంతరిక్ష పరిశోధనల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. అక్కడి వర్కింగ్ సరిస్థితుల గురించి తెలుసుకుంటారు. మే 13 నుంచి 24 మధ్య యువిక కార్యక్రమం జరుగనుంది. మార్చి 20 లోపు విద్యార్ధలు అప్లై చేసుకుంటే..మార్చి 28న సెలెక్టడ్ విద్యార్ధులు లిస్ట్‌ను ప్రకటిస్తారు. రెండో లిస్ట్‌ను ఏప్రిల్ 4న రిలీజ్ చేస్తారు. ఎంపిక అయిన విద్యార్ధుల లేదా తల్లిదండ్రులకు ఇస్రో మెయిల్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి అప్లై చేసుకునే విద్యార్థులు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఆధార్ కార్డు, 8వ క్లాస్ మార్క్ షీట్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.

అప్లికేషన్ ఫారమ్...

ఇస్రో అధికారిక పోర్టల్‌లోకి వెళ్ళాక అక్కడ ఉన్న అప్లై ఫర్ యువిక రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, అడ్రస్‌లను ఇవ్వాలి. ఆ తర్వాత మొబైల్, ఈ మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయ్యాక, లాగ్‌ఇన్ అయ్యి, space quiz లో పాల్గొనాలి. తర్వాత పర్సనల్ వివరాలు, ఎడ్యుకేషన్ వివరాలు ఇచ్చి, ముఖ్యమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చెయ్యాలి. తర్వాత సబ్‌మిట్ చెయ్యాలి.

Also Read:Ananth Ambani Pre Wedding :నా జీవితం పూలపాన్పు కాదు..కన్నీళ్ళు పెట్టించిన అనంత్ అంబానీ స్పీచ్

Advertisment
Advertisment
తాజా కథనాలు