ISRO: నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 రాకెట్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F14 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

New Update
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 రాకెట్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు GSLV-F14 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇన్‌శాట్‌ - 3 ఉపగ్రహాన్ని GSLV-F14 రాకెట్‌ను మోసుకెళ్లింది. 18 నుంచి 19 నిమిషాల్లోనే ఇది నిర్ణీత కక్షకు చేరుకునేలా శాస్త్రవేత్తలు రూపొందించారు. వాతారవరణ విపత్తులతో పాటు భూమి, సముద్ర ఉపరితలంపై పరిశోధనలు చేసి ఇన్‌శాట్‌ - 3 శాటిలైట్‌ కీలక సమాచారాన్ని అందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌–3డీ, ఇన్‌శాట్‌–3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే.. ఇన్‌శాట్‌–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో ప్రకటించింది.

Also Read: బాణాసంచా తయారీ కార్మాగారంలో పేలుడు.. 10 మంది మృతి..

సుమారు 2,275 కిలోల బరువున్న ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. అయితే ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల మార్పులను పర్యవేక్షిస్తూ సమాచారాన్ని అందించనుంది. పదేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలను అందించనుంది.

Also Read: షర్మిల విమర్శలు.. మేనల్లుడి పెళ్లికి జగన్ దూరం!

Advertisment
Advertisment
తాజా కథనాలు