IIT Madras: 60ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా అందుకున్న ఇస్రో ఛైర్మన్! ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ 60ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన మద్రాస్ ఐఐటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. By srinivas 19 Jul 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి ISRO Chairman: ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ 60ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన మద్రాస్ ఐఐటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. ఈ మేరకు మద్రాస్ ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు సోమనాథ్. View this post on Instagram A post shared by Dr. S. Somanath (@isro_chairman) ఐఐటీ ఎంట్రెన్స్ టెస్ట్ రాసే ధైర్యం చేయలేక.. ఇక ఒక పల్లెటూరిలో పుట్టి పెరిగిన తాను టాపర్ అయినప్పటికీ ఐఐటీ ఎంట్రెన్స్ టెస్ట్ రాసే ధైర్యం చేయలేదన్నారు. గ్రాడ్యుయేషన్ చేయాలనే కోరిక మాత్ర ఉండేదని, ఆ కల ఇప్పుడు నెరవేరిందని చెప్పారు. గతంలో ఐఐటీ- బెంగళూరు నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నా. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే నా జీవితంలో సాధించాల్సిన విషయాలపై శ్రద్ధ పెట్టాలని, వాటిని నెరవేర్చుకునేందుకు నిరంతరం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నానని సోమనాథ్ చెప్పారు. కేరళలోని అళప్పుళ జిల్లాలో జన్మించిన సోమనాథ్.. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం ఆయన సారథ్యంలోనే జరగడం విశేషం. #isro-chairman-somnath #phd #iit-madras మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి