Israel Vs Palestine: పాపం పసివాళ్లు.. మంచినీళ్లు లేక చనిపోయే పరిస్థితులు..! హమాస్‌పై ప్రతీకార చర్యల్లో భాగంగా గాజాకు ఇజ్రాయెల్ ప్రధాన సరఫరాలన్ని నిలిపివేసింది. అందులో నీరు కూడా ఉండడంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంచినీరు కోసం చిన్నారులు బారుల తీరిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. గాజా జనాభాలో 47శాతం మంది 17ఏళ్ల లోపు వారే ఉండడం..వారందరికి ఇప్పుడు తాగడానికి నీళ్లు లేకపోవడం కలవరపెడుతోంది By Trinath 17 Oct 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 'అమ్మా మంచినీళ్లు కావాలి.. ఇంట్లో తాగడానికి నీళ్లు ఎందుకు లేవు.. మొన్నటివరకు ఉన్నాయి కదా.. నాకు దాహంగా ఉందమ్మా..' ఇది గాజా(Gaza Strip)లో సగటు పసివాడి నరకవేదన. తన్నుకు చస్తుంది పెద్దవాళ్లు.. దాహంతో నోరు ఎండిపోతుంది మాత్రం చిన్నారులకు. తాగడానికి నీళ్లు లేక గాజాలో చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) పోరు చిన్నారుల ప్రాణం మీదకు తీసుకొచ్చింది. మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది నీరు మాత్రమే. తినకుండా అయినా కొంతకాలం బతకచ్చుకానీ.. తాగే నీరు లేకపోతే మాత్రం బతుకులు అక్కడే కూలిపోతాయి. నీళ్లు ఆపేసిన ఇజ్రాయెల్: ఇజ్రాయెల్-హమాస్ పోరులో తీవ్రవాదులకు నిత్యావసరాలు నిలిపివేయాలన్న ఆలోచనలో ఇజ్రాయెల్ చేసిన ఈ పని అక్కడి పిల్లలకు కష్టాలను తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ గాజాకు ప్రధాన సరఫరాలను నిలిపివేయడంతో భారీ నీటి సంక్షోభం తలెత్తింది. గాజాలో 47శాతం మంది 17ఏళ్లలోపు వారేనని లెక్కలు చెబుతున్నాయి. నీటితో పాటు వాటర్ ప్లాంట్లకు శక్తినిచ్చే ఇంధనంతో పాటు విద్యుత్తును కూడా నలిపివేసింది ఇజ్రాయెల్. దీంతో లక్షలమంది నీరు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాటర్ కోసం ప్లాంట్ల వద్ద పిల్లలు బారులు తీరుతున్న దుస్థితి గాజాలో నెలకొంది. డీహైడ్రెషన్‌తో అనేక ప్రమదాలు: గాజాలో పరిస్థితి ఇలానే కొనసాగితే అక్కడి ప్రజల జీవితాలు ప్రమాదంలో పడినట్టే. ఇది డీహైడ్రెషన్‌కు దారి తీస్తుంది. బాడీ హైడ్రెటెడ్‌గా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరంలో 70శాతం వరకు నీరే ఉంటుంది. అంటే సగటున మనిషి తన శరీరంలో 40 లీటర్ల నీటిని కలిగి ఉంటాడు. డీహైడ్రేషన్ శరీరాన్ని బలహీనపరుస్తుంది. మన శరీరంలో రెండు శాతం నీరు తగ్గినా అది మన బాడీ పనితీరుకు చెడు చేస్తుంది. అధ్యయనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మీ శరీరంలో నీటి శాతం తగ్గితే అప్పుడు మీ రక్తం మరింత జిగటగా మారుతుంది ఇది లో బీపీకి దారితీస్తుంది. అప్పుడు మీ అవయావలకు సరిపడా ఆక్సిజన్ అందదు. డీహైడ్రెషన్ కారణంగా మరణిస్తే అంతకంటే దారుణమైన విషయం ఏదీ ఉండదు. ALSO READ: ఊచకోత కోస్తున్న మహాస్‌కు ఇజ్రాయెల్ మహిళ సపోర్ట్.. షాకింగ్ వీడియో వైరల్..!! #israel-vs-hamas #israel-vs-palestine మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి