Israel Hamas war: మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే? మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని పీఎం మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపారు. కొనసాగుతున్న పరిస్థితిపై అప్‌డేట్ అందించిన నెతన్యాహుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారన్నారు మోదీ. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్ ఖండిస్తుందని చెప్పారు. By Trinath 10 Oct 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మోదీ(Modi)తో ఇజ్రాయెల్(israel) ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని పీఎం మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపారు. కొనసాగుతున్న పరిస్థితిపై అప్‌డేట్ అందించిన నెతన్యాహుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారన్నారు మోదీ. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్ ఖండిస్తుందని చెప్పారు. I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations. — Narendra Modi (@narendramodi) October 10, 2023 వార్ మొదటి రోజు నుంచి ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గానే: అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. గాజా స్ట్రిప్ ప్రస్తుతం హమాస్ అండర్‌లో ఉంది. హమాస్‌పై ప్రతికార చర్యగా ఇజ్రాయెల్ రివర్స్ అటాక్ చేసింది. యుద్ధంలో ఇప్పటివరకు 1500 మందికి పైగా మరణించారు. ఇక ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌కి మద్దతుగా మాట్లాడుతోంది. గతంలో యుద్ధ సమయాల్లో ఇండియాకు ఇజ్రాయెల్ సాయం చేసిందని చరిత్ర చెబుతోంది. ఇక ఇజ్రాయెల్ విషయంలో బీజేపీ మొదటి నుంచి పాజిటివ్ వైఖరితోనే ఉంటుంది. మిత్రపక్షంగా భావిస్తుంది. అందుకే యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్‌కి సంఘీభావం తెలిపింది. వార్ స్టార్ట్ అయిన తర్వాత మోదీ ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా ట్వీట్ చేయడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. అక్టోబర్ 7న కూడా మోదీ ఇజ్రాయెల్‌ని సంఘీభావంగా ట్వీట్ చేశారు. 'ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడుల వార్తతో తీవ్ర దిగ్భ్రాంతి. మా ఆలోచనలు, ప్రార్థనలు అమాయక బాధితులు, వారి కుటుంబాలతో ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలబడతాం' అని ట్వీట్ చేశారు. Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour. — Narendra Modi (@narendramodi) October 7, 2023 పెరుగుతున్న మృతుల సంఖ్య: గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు, 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ ఇరువైపుల నుంచి 15వందల మందికిపైగా మరణించినట్టు సమాచారం. ఇక హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు భారత్‌తో పాటు, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్, పాలస్తీన మధ్య భీకరపోరు జరుగుతోంది. వరుసగా 4రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. గాజాపై ఇప్పటి వరకు 5 వేల బాంబులు పేల్చారు. నిన్న ఒక్క రోజే 2400 బాంబు దాడులు చేశారు. ఇజ్రాయెల్ దాడిలో వేలాది బిల్డింగ్‌లు కుప్పకూలిపోయాయి. గాజా సిటీని భస్మం చేస్తూ రాకెట్లతో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ALSO READ: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కన్నీటి దృశ్యాలు..!! #israel-palestine-conflict మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి