World Cup: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?

వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌కు క్రేజీ తగ్గిందా? ఇంతకు ముందు ఉన్నంత హడావుడి ఇప్పుడు లేదా? క్రికెట్ నుచూసే జనాలు తక్కువ అవుతున్నారా...లేక వన్డే ఫ్మార్మాట్ ను చూడ్డానికి ఇష్టపడ్డం లేదా. ప్రస్తుం భారత్‌లో వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. మామూలుగా వరల్డ్‌కప్ అంటే ఎక్కడ లేని మోజు ఉంటుంది. అందులోనూ క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో అయితే మరీను. కానీ ఈ సారి పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. ఎక్కడా అసలు హడావుడే లేదు. మొన్న జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌కి కూడా జనాలు అస్సలు స్పందించలేదు. కోట్లమంది జనాభా ఉన్న దేశంలో వ్యూస్ కేవలం లక్షల్లో ఉంది అంటేనే అర్ధమవుతుంది వరల్డ్‌కప్ ఎంత చప్పగా సాగుతోందో.

New Update
World Cup: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?

ప్రస్తుతం క్రికెట్ మూడు ఫార్మాట్లలో అవుతోంది. ఒకప్పుడు కేవలం టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే క్రికెట్ ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో వన్డే ఫార్మాట్ అందుబాటులోకి వచ్చింది. దాని తర్వాత పొట్టి ఫార్మాట్ అనే టి20 ఫార్మాట్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే టెస్ట్ ఫార్మాట్ వన్డే ఫార్మాట్ కి రానంత క్రేజ్ టి20 ఫార్మాట్ కి మాత్రం అతి తక్కువ సమయంలోనే వచ్చేసింది. ఇందులో మ్యాచ్ ఫలితం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.. గంటల తరబడి టీవీలకు అతుక్కు పోవాల్సిన పనిలేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఎవరు విజేత అన్న విషయం తేలిపోతూ ఉంటుంది. అంతేకాదు ఇందులో మ్యాజిక్‌లు కూడా ఎక్కువగానే జరగుతూ ఉంటాయి. క్రికెట్ లవర్స్ కు కావల్సిన వినోదం అంతా ఫుల్ గా వచ్చేస్తుంది. దీంతో ఇక టి20 ఫార్మాట్ క్రేజ్ అంతకంతకు పెరిగిపోయింది. అందులోనూ ఐపీఎల్ లాంటివి రావడం, అన్ని దేశాల క్రికెటర్లు కలిపి ఆడడంతో పొట్టి ఫార్మాట్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

టి20 ఫార్మాట్ కు క్రేజ్ పెరగడం మంచిదే అయినా దీనివలన మిగతా ఫార్మాట్లు మాత్రం ప్రమాదంలో పడిపోయాయి. దానికి నిదర్శనమే ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్. అసలు ఎక్కడా హడావుడి లేకుండా చప్పగా సాగుతున్న ప్రపంచకప్‌ చేస్తే ఈ విషయం ఎవరికైనా అర్ధం అవుతుంది. టీ20లకు అలవాటు పడిపోయిన క్రాకెట్ అవర్స్ ఇప్పుడు గంటల తరబడి టీవీల దగ్గర కూర్చుని మ్యాచ్ చూడ్డానికి ఇష్టపడ్డంలేదు. అది వరల్డ్‌కప్ అయినా సరే అంటున్నారు. భారత్‌లో క్రికెట్ మతం అంటారు. అవడానికి దేశ క్రీడ హాకీయే గానీ...ఇక్కడ అందరూ ఎక్కువగా ఆడేది, చూసేది కూడా క్రికెట్. అలాంటి భారత్ లో ఈసారి వరల్డ్ కప్ జరుగుతోంది. అంటే ఎంత హడావుడి ఉండాలి. దీనికి ముందు 2011లో మనదేశంలో ప్రపంచకప్ జరిగింది. అప్పుడు ఇండియాలో సందడి మామూలుగా లేదు. టోర్నీ జరుగుతున్న రోజులూ జనాలు టీవీలకు, స్టేడియాలకు అతుక్కుపోయారు. దాంతో పాటూ మనకే కప్ రావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. కానీ ఇప్పుడు ఆ సందడే లేదు. భారీ హైప్, క్రేజ్ ఉండే భారత్-పాక్ మ్యాచ్ కూడా చప్పగా అయిందింటేనే తెలుస్తోంది మనదేశంలో వన్డే క్రికెట్ కు ఎంత నిరాదరణ ఉందో. భారత్-పాక్ మ్యాచ్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధంలా అయిపోతుంది వాతావరణం. ఎక్కడో ఒక చోట గొడవలు జరుగుతాయి. అలాంటిది ఈసారి ఆ మ్యాచ్ కూడా చాలా మామూలుగా కామ్ గా అయింది. మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ స్టేడియం అయితే నిండిపోయింది కానీ టీవీల్లో చూసే జనాలు మాత్రం బాగా తగ్గిపోయారు. గొడవలు, బెట్టింగులు లాంటివి అయితే అసలు జరగనేలేదు. ఈ మ్యాచే ఇలా అయింది అంటే మిగతా దేశాల మ్యాచ్‌ల గురించి అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. వాటికి అయితే స్టేడియానికి కూడా జనాలు వెళ్ళడంలేదు. ఇక టీవీల సంగతి ఏం చెప్పాలి.

అసలు ఐసీసీయే వరల్డ్‌కప్‌ను పట్టించుకోలేదు..

ఇంతకు ముందు వరకు వరల్డ్‌కప్ అంటే ఐసీసీ కూడా చాలా హడావుడి చేసేది. భారత్ లో జరిగితే బీసీసీఐ కూడా చాలా పట్టించుకుంటుంది. అలాంటి ఈసారి టోర్నీని ఐసీసీ అసలు పట్టించుకోనే లేదు. మామూలుగా ప్రపంచకప్ మొదలు అయినప్పుడు ఆరంభ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఏదేశంలో జరిగినా భారీ వేడుకలు నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం ఏ హడావుడి లేకుండా వరల్డ్‌కప్‌ను మొదలెట్టేశారు. ఒక కార్యక్రమం లేదు, గెస్ట్‌లు లేరు అసలు మొదటి మ్యాచ్‌కు ప్రేక్షకులే లేరు. పిట్టలు వేసిన రెట్టలతో ఖాళీ సీట్లు స్టేడియంలో దర్శనమిచ్చాయి. అసలే వన్డే ఫార్మాట్ కు ఆదరణ తగ్గుతుందని అభిప్రాయాలు ఉన్నప్పుడు ఐసీసీ, బీసీసీఐ ఇలా వ్యవహరించడం ఏం బాలేదని అంటున్నారు.

Also Read:నన్ను అయోమయంలో పెట్టి రామోజీ షేర్లు మార్చుకున్నారు-యూరిరెడ్డి

దీనికి తోడు బీసీసీఐ చేసిన మరోపని కూడా విమర్వలు పాలయ్యింది. టోర్నీ ఆరంభంలో ఏ కార్యక్రమాలు పెట్టకుండా మొదలెట్టిన ఐసీసీ, బీసీసీఐలు భారత్-పాక్ మ్యాచ్ కు మాత్రం హడావుడి చేశాయి. లేని హైప్‌ని క్రియేట్ చేస్తూ ఈ మ్యాచ్‌కు ముందు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టాయి. దీనికి అమితాబ్, సచిన్ లాంటి గెస్ట్‌లను కూడా పిలిచారు. పోనీ చేసేదేదో ఫుల్‌గా చేశారా అంటూ మళ్ళీ అదీ లేదు. ప్రత్యేక కార్యక్రమం పెట్టారు కానీ మళ్ళీ దాన్ని ప్రత్యక్ష ప్రసారం మాత్రం చేయలేదు. కేవలం స్టేడియంలో ఉన్నవారు మాత్రమే దాన్ని చూశారు. దాంతో ఆ ఐడియా కూడా ఫ్లాప్ అయింది. భారత్-పాక్ మ్యాచ్‌ను మిగతా వాటికంటే ఎక్కువ మంది చూశారు కానీ ఇంతకు ముందు ఉన్నంత క్రేజ్ మాత్రం కనిపించలేదు. అక్కడక్కడా పెద్ద స్క్రీన్‌లతో హడావుడి చేశారు అంతే. ఓవరాల్‌గా దానికి దక్కాల్సి వ్యూస్ దక్కలేదనే చెప్పాలి.

కోవిడ్ కారణమా?
క్రికెట్‌కు క్రేజ్ దక్కడానికి కోవిడ్ కారణమా అంటే పూర్తిగా కొట్టిపడేయలేము. ప్రస్తుతం కోవిడ్ ఎక్కడా లేదు. కానీ కోవిడ్ తర్వాత జనాలు బయట ఎంటర్టైన్‌మెంట్స్‌కు వెళ్ళడం తగ్గింది. థియేటర్లలో సినిమాలు చూడ్డం ఎలా అయితే తగ్గించేవారో...స్టేడియానికి వెళ్ళి క్రికెట్ చూడ్డం కూడా అంతే తగ్గిపోయింది. అయితే ఓటీటీల్లో సినిమాకు ఆదరణ పెరిగింది కానీ క్రికెట్‌కు మాత్రం టీవీల్లో కూడా ఆదరణ లేదు. కేవలం టీ20, ఐపీఎల్ అయితేనే జనాలు చూస్తున్నారు. లేకపోతే మానేస్తున్నారు. వన్డే ఫార్మాట్ల పరిస్థితే ఇలా ఉంది అంటే టెస్ట్‌ల గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

CSK VS LSG

గెలిచింది...గెలిచింది...చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి మ్యాచ్ గెలిచింది.  పేలవమైన ప్రదర్శనతో అందరినీ నిరాశకు గురి చేస్తున్న సీఎస్క్ కు ఈరోజు మంచి విజయం దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 5 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. వరుసగా ఐదు ఓటములను మూట గట్టకున్న సీఎస్కో ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. స్వయంగా కెప్టెన్ ధోనీనే మ్యాచ్ ను గెలిపించడం ఈ మ్యాచ్ లో మరొక విషయం. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె (43*), రచిన్‌ రవీంద్ర (37), షేక్‌ రషీద్‌ (27), ధోనీ (26*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేశ్‌ ఖాన్‌, మార్‌క్రమ్‌, దిగ్వేశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి..

ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. తొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

చెలరేగిన పంత్..

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.  దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  
 

today-latest-news-in-telugu | IPL 2025 | csk-vs-lsg 

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Advertisment
Advertisment
Advertisment