Health Tips: ECGలో 100 కంటే ఎక్కువ BPM ప్రమాదకరమా? ఛాతీనొప్పి, బీపీతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి. ఏదైనా గుండె జబ్బులు, గుండె కొట్టుకునే వేగాన్ని గుర్తించడానికి, వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. ECGలో BPM 100 కంటే ఎక్కువ ఉంటే అది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి health Tips: గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసుకునేందుకు ECG టెస్ట్ చేస్తారు. ECGలో BPM 100 కంటే ఎక్కువ ఉంటే అది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి సందర్భంలో BPM 100 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదమా?..వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఏదైనా గుండె జబ్బులు, గుండె కొట్టుకునే వేగాన్ని గుర్తించడానికి, వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. ఈ పరీక్ష ద్వారా నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం BPM 60 నుంచి 80 మధ్య ఉంటే అది సాధారణం, కానీ అది 100 కంటే ఎక్కువ ఉంటే అది గుండె జబ్బుకు సంకేతమని అంటున్నారు. అనేక సందర్భాల్లో ప్రజలు 100 కంటే ఎక్కువ BPM వస్తే భయపడతారు. అంతేకాకుండా కొన్ని గుండె జబ్బులకు సంకేతంగా భావిస్తారు. ఛాతీనొప్పి, బీపీతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఈసీజీ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ECG 100 BPM కంటే ఎక్కువ ఉంటే?: ECGలో BPM 100 కంటే ఎక్కువ ఉంటే అది టాచీకార్డియాకు సంకేతం కావచ్చు. టాచీకార్డియాలో గుండె సాధారణ వేగం కంటే వేగంగా కొట్టుకుంటుంది. ఇది గుండె జబ్బులకు సంకేతం అని నిపుణులు అంటున్నారు. కానీ ECGలో BPM 100 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదం ఏమీ కాదని, అలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. గుండె వేగం పెరగడానికి కారణాలు: ECG చేయించుకోవడానికి ముందు ఒక వ్యక్తి 200 నుంచి 300 అడుగులు నడిచినా ECGలో BPM పెరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా జ్వరం, భయం వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి సాధారణ స్థితిలో ECG చేయించుకుంటున్నట్లయితే, అతని BPM పెరిగితే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. ఇది కూడా చదవండి: శుక్రవారం మనీప్లాంట్ దగ్గర ఇవి ఉంచితే డబ్బే డబ్బు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #bpm #heart #ecg మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి