GST on Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గుతుందా? తేలేది అప్పుడే!

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. జీఎస్టీ కౌన్సిల్ రేపు అంటే సెప్టెంబర్ 9న జరిపే సమావేశంలో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కోరుతున్నారు. 

New Update
GST on Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గుతుందా? తేలేది అప్పుడే!

GST on Health Insurance:  హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ అంశం చాలా కాలంగా చర్చల్లో ఉంది. దీనిపై ఒక స్పష్టత రావడానికి ఒక్కరోజు సమయం ఉంది.  జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సోమవారం అంటే సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ సమావేశం తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందా లేదా అన్నది తేలనుంది. ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తే లేదా తొలగించినట్లయితే, దేశంలోని కోట్లాది మందికి ఆరోగ్య బీమా అందుబాటులోకి వస్తుంది. అయితే, మరోవైపు ఇది ప్రభుత్వ ఆదాయాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ కౌన్సిల్ ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కౌన్సిల్‌కు ఆప్షన్లు ఇచ్చిన ఫిట్‌మెంట్ కమిటీ.. 

GST on Health Insurance:  జీఎస్టీ కౌన్సిల్‌లోనే ఫిట్‌మెంట్ కమిటీ ఉంది. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ రేట్ల మార్పుపై చాలా కాలంగా ఈ కమిటీలో చర్చ జరుగుతోంది. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ అధికారులు కూడా పాల్గొంటారు. తుది నిర్ణయం కౌన్సిల్ చేతిలో ఉన్నప్పటికీ, కమిటీ జిఎస్‌టి కౌన్సిల్‌కు అనేక సూచనలను అందించింది. ప్రస్తుతం పాలసీదారులు హెల్త్ ఇన్సూరెన్స్  ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. యితే దీనిపై జీఎస్టీని రద్దు చేయాలని లేదా ఈ రేటును 5%కి తగ్గించాలని ప్రభుత్వం నుండి డిమాండ్ ఉంది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా.. 

GST on Health Insurance:  వైద్య బీమా ప్రీమియంను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నెల రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు. మరోవైపు రాష్ట్రాల నుంచి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి.  కర్నాటక ప్రభుత్వం తక్కువ - మధ్య ఆదాయ గ్రూపు పాలసీదారులకు ఆరోగ్య బీమాపై 18% GST అమలును పునఃపరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా జీఎస్టీని ఎత్తివేసి సామాన్యులకు ఉపశమనం కలిగించాలని కౌన్సిల్‌ను అభ్యర్థించారు.

బీమా హోల్డర్లకు ప్రయోజనాలు అందించాలి .. 

GST on Health Insurance:  నిజానికి ప్రభుత్వం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పై జీఎస్టీ తగ్గించాలని భావిస్తోంది. అయితే, ఏదైతే జీఎస్టీ భారాన్ని తగ్గిస్తారో అది ప్రజలకు చేరుతుందా? లేదా అనేది అనుమానమే అని భావిస్తున్నారు. జీఎస్టీ ప్రభుత్వం తగ్గించినా.. కంపెనీలు తమ లాభం పెంచుకోవడానికి దాని ప్రయోజనాన్ని ప్రజలకు ఇవ్వకపోవచ్చనే భయం కౌన్సిల్ కు ఉంది. అందుకే, దీని విషయంలో పాలసీ హోల్డర్స్ కు లాభం చేకూర్చే విధానం పై కసరత్తులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో వినియోగదారులపై భారం తగ్గించడంతోపాటు లాభాలు కంపెనీల జేబుల్లోకి వెళ్లకుండా చూసే ఫార్ములా ఇవ్వడానికి ప్రయత్నిస్తారని భావిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

 

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news telugu | latest telangana news | andhra-pradesh-news | international news in telugu | national news in Telugu | telugu crime news | telugu-cinema-news | telugu-film-news | telugu-sports-news | telugu-cricket-news | latest technology news in telugu | business news telugu

  • Apr 06, 2025 13:23 IST

    వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో

    తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వస్తానని అఘోరీ సంచనల వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను కాశీలో ఉన్నానని తెలిపింది. తనపై విమర్శలు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.

    Aghori coming from Kashi to Hyderabad released a video
    Aghori coming from Kashi to Hyderabad released a video Photograph: (Aghori coming from Kashi to Hyderabad released a video)

     



  • Apr 06, 2025 12:00 IST

    భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు

    భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాముల వారి కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఆలయమంతా కూడా రామ నామస్మరణతో మార్మోగుతోంది.



  • Apr 06, 2025 10:35 IST

    ఆదాన్‌ డిస్లరీ, శార్వాని ఆల్కో బ్రువ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది



  • Apr 06, 2025 08:24 IST

    క్రికెట్‌ బెట్టింగ్‌కు బలైన మరో యువకుడు ఆత్మహత్య

    ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లు చేసి అప్పుల తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సుచిత్రలో ఉంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి బెట్టింగ్, మద్యానికి బానిసై అప్పులు చేశాడు. వీటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

    Cricket betting
    Cricket betting

     



  • Apr 06, 2025 08:23 IST

    ఏపీలో ఘోర విషాదం.. గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ..

    ఏపీ కర్నూలులో ఘోరం జరిగింది. నందవరం ముగతి క్రాస్  NH167 వద్ద రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలకాపరులపైకి లారీ దూసుకెళ్లింది. లింగన్న అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. కొన్ని గొర్రెలు దుర్మరణం చెందాయి. 

    ap accident
    ap accident Photograph: (ap accident)

     



  • Apr 06, 2025 08:22 IST

    మొత్తానికి అలేఖ్య పాపని ఏడిపించేశారు కదరా.. వెక్కి వెక్కి ఏడుస్తున్న చిట్టి (వీడియో వైరల్)

    అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. నాన్న ఉన్నా ధైర్యంగా ఉండేదని ఆ వీడియోలో అలేఖ్య చెబుతుంది.

    Alekhya Chitti crying after Alekhya Chitti Pickles Issue Video goes viral
    Alekhya Chitti crying after Alekhya Chitti Pickles Issue Video goes viral Photograph: (Alekhya Chitti crying after Alekhya Chitti Pickles Issue Video goes viral )

     



  • Apr 06, 2025 08:21 IST

    అమెరికాకు ఎగుమతులను ఆపేస్తున్న బడా కంపెనీల కార్లు..జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రేక్

    ట్రంప్ సుంకాల దెబ్బ గట్టిగానే పడుతోంది. కార్ల మీద కూడా దీని ఎఫెక్స్ చూపిస్తోంది. పెద్ద కంపెనీలు తమ కార్ల ఎగుమతులపై ఆలోచిస్తున్నారు. తాజాగా జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్ బ్రిటిష్‌లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది.



  • Apr 06, 2025 08:21 IST

    మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!

    తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది.సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.



  • Apr 06, 2025 08:21 IST

    ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. IPLకి ధోనీ గుడ్ బై..?

    MS ధోని ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని పోస్టులు చక్కర్లు కొట్టాయి. దానికి తోడు ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌ను లైవ్‌లో చూడటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది.

    MS Dhoni To Retire after CSK vs DC IPL 2025 match
    MS Dhoni To Retire after CSK vs DC IPL 2025 match Photograph: (MS Dhoni To Retire after CSK vs DC IPL 2025 match)

     



  • Apr 06, 2025 08:20 IST

    ఆర్చర్ విధ్వంసం.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు



  • Apr 06, 2025 08:20 IST

    అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు



  • Apr 06, 2025 08:19 IST

    అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్‌ కోస్టర్‌ నుంచి కిందపడి యువతి స్పాట్‌డెడ్!



Advertisment
Advertisment
Advertisment