IPL2024: ప్లే ఆఫ్స్ కు చేరే జట్లు అవే..ఇర్ఫాన్ పఠాన్

ఐపీఎల్ 2024 లో టాప్ 4లో ఉండే జట్లు ఇవేనంటూ.. టీమిండియా మాజీ ఆల్ రౌెండర్ ఇర్ఫాన్ పటాన్ జోస్యం చెప్పారు. సీఎస్ కే ,ముంబయి,కల్ కత్తా,లఖ్ నవూ జట్లకు అవకాశం కల్పించిన ఇర్ఫాన్ ఆర్సీబీ పేరును   చెప్పకపోవటం గమనార్హం.

New Update
IPL2024: ప్లే ఆఫ్స్ కు చేరే జట్లు అవే..ఇర్ఫాన్ పఠాన్
IPL 2024 సీజన్ మరికొద్ది సేపటిలో ప్రారంభమవుతుంది. చెన్నై సూపరి కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. కాని కొందరు మాజీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం టాప్ 4 లోకి వెళ్లే జట్ల గురించి ఇప్పుడే జోస్యం చెబుతున్నారు. ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, స్టీవ్ స్మిత్, డేల్ స్టెయిన్ లాంటి ఆటగాళ్లు టాప్-4లో నిలిచే జట్ల విషయమై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అంబటి రాయుడు మూడు దక్షిణాది జట్లతోపాటు ముంబై ప్లేఆఫ్స్ చేరుతుందని చెప్పగా.. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఆర్సీబీ, సన్‌రైజర్స్‌ను మినహాయించాడు. కోల్‌కతా, లక్నో, ముంబై, చెన్నైలను ఫేవరేట్లుగా పేర్కొన్నాడు.

ఈసారి ముంబై ఇండియన్స్‌తోపాటు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరుకుంటాయని ఇర్ఫాన్ పఠాన్ అంచనా వేశాడు. రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్, గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ సైతం టాప్-4లో నిలుస్తాయని అభిప్రాయపడ్డాడు.లీగ్‌లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ సాధించడంతోపాటు తర్వాతి సీజన్లో రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌తోపాటు.. విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లను ఇర్ఫాన్ ప్లేఆఫ్స్ జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. ఈసారి డబ్ల్యూపీఎల్‌లో బెంగళూరు అమ్మాయిలు టైటిల్ సాధించి ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు. దీంతో పురుషుల జట్టు కూడా టైటిట్ కొడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు

ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్న నాలుగు జట్లలో చెన్నై, ముంబై, లక్నో జట్లు గత సీజన్లోనూ టాప్-4లో నిలిచాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం చివరగా 2021లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతోపాటు ఫైనల్‌కు సైతం అర్హత సాధించింది.‘ముంబై ఇండియన్స్ ఎంతో బలంగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాన్వే గాయపడ్డాడు. దీపక్ చాహర్ ఇప్పుడే తిరిగొస్తున్నాడు. కానీ ఆ జట్టులో ధోనీ ఉన్నాడు. అతడెప్పుడూ జట్టును ముందుకు తీసుకెళ్తాడు. లక్నో సూపర్ కింగ్స్ ఎంతో నిలకడగా ఆడుతోంది. కాగితం మీద కేకేఆర్ ఎంతో బలంగా కనిపిస్తోంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు.

తర్వాత క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. ముంబై, లక్నో, ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉందని పఠాన్ చెప్పడం గమనార్హం.
ముంబై, లక్నో, ఢిల్లీ, చెన్నై జట్లు టాప్-4లో నిలుస్తాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంచనా వేశాడు. సన్‌రైజర్స్, చెన్నై, ముంబై జట్లు టాప్‌-4లో నిలుస్తాయని డేల్ స్టెయిన్ చెప్పగా.. ఢిల్లీ, చెన్నై జట్లు టాప్-4లో ఉంటాయని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు.

ఇక ఆంధ్రా క్రికెటర్ అంబటి రాయుడైతే.. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై జట్లు టాప్-4లో ఉంటాయని జోస్యం చెప్పాడు. రాయుడు గతంలో ముంబైతోపాటు చెన్నై తరఫున ఐపీఎల్‌లో ఆడిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు