IRCTC: ఒక్కరోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసే అద్భుతమైన ప్యాకేజీ రైలు ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలు అస్వాధించడం అనేది మాటల్లో వర్ణించలేని అనుభూతి. అలాంటి అందమైన ప్రయాణం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే ప్రకృతి అందాలకు నిలయమైన ప్రాంతాలను చూడాలని ఎంతోమంది తపిస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా కుటుంబసభ్యులతో అక్కడ గడపాలనుకుంటారు. By BalaMurali Krishna 23 Sep 2023 in వైజాగ్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి IRCTC: రైలు ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలు అస్వాధించడం అనేది మాటల్లో వర్ణించలేని అనుభూతి. అలాంటి అందమైన ప్రయాణం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే ప్రకృతి అందాలకు నిలయమైన ప్రాంతాలను చూడాలని ఎంతోమంది తపిస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా కుటుంబసభ్యులతో అక్కడ గడపాలనుకుంటారు. ఆంధ్రా ఊటీగా పేరుగడించిన అరకు లోయ అందాలను ఒక్కరోజులోనే చూసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? ఇలాంటి అవకాశమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కల్పిస్తోంది. విశాఖపట్టణం రైల్వే స్టేషన్ నుంచి ఉదయం మొదలయ్యే ఈ ప్రయాణం రాత్రికి ముగుస్తుంది. ఈ ప్యాకేజీ వివరాలు ఓసారి పరిశీలిస్తే.. ప్రతీ రోజూ ఉదయం 6.45 గంటలకు(08551) రైలు విశాఖ నుంచి అరకు రైల్వేస్టేషన్‌కు అందుబాటులో ఉంటుంది. విశాఖలో బయలుదేరి ప్రకృతి అందాల నడుమ ఈ ప్రయాణం సాగుతుంది. సొరంగాలు, బ్రిడ్జిలు వంటి ప్రకృతి రమణీయత నడుమ ఈ రైలు ప్రయాణం ఉంటుంది. ఉదయం 10.55 గంటలకు అరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆదివాసీ మ్యూజియం, చాపరాయి, గార్డెన్స్ వంటివి చూడవచ్చు. తిరుగుప్రయాణం మాత్రం రోడ్డు మార్గాన ఉంటుంది. రోడ్డు మార్గంలో భాగంగా కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్ర గుహలు వీక్షించవచ్చు. అనంతరం విశాఖ రాగానే మీ ప్రయాణం ప్యాకేజీ ముగుస్తుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, టీ, స్నాక్స్ ఈ ప్యాకేజీలోనే లభిస్తాయి. ప్రయాణ బీమా సదుపాయం కూడా లభిస్తుంది. ప్యాకేజీ ఛార్జీలు చూస్తే.. ** సెకండ్ క్లాస్‌లో ప్రయాణిస్తే పెద్దలకు రూ. 2,130, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 1760 చెల్లించాల్సి ఉంటుంది. ** స్లీపర్ క్లాసులో ప్రయాణించే పెద్దలకు రూ. 2,385, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 1915 చెల్లించాల్సి ఉంటుంది. ** ఎగ్జిక్యూటివ్ ఛైర్‌లో ప్రయాణించే పెద్దలకు రూ. 4450, 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు రూ. 4,080 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 15 రోజుల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే రూ.250లు కట్ చేసుకుంటారు. అలాగే నాలుగు రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు తిరిగి ఇవ్వరు. ప్యాకేజీ వివరాల కోసం IRCTC వెబ్‌సైట్ క్లిక్ చేయండి. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి భేటి అయిన కోవింద్ కమిటీ #vizag #irctc #araku మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి