Iran: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్న దేశస్థులు! ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్‌లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్‌లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇక విదేశాల్లో ఉన్న ఇరానీయులు కూడా ఆయన మృతిని ఓ పండుగల సెలబ్రేట్ చేసుకున్నారు. By Bhavana 21 May 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Iranians celebrated President Ebrahim Raisi Death: ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. సాధారణంగా దేశాధ్యక్షుడు చనిపోయాడని తెలిస్తే..ఆ దేశంలో విషాదం నెలకొంటోంది. కానీ ఇరాన్ లో మాత్రం ప్రజలు ఇబ్రహీం రైసీ మరణ వార్త తెలుసుకుని సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి , మందు పార్టీలతో ఆయన మృతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్‌లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్‌లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇక విదేశాల్లో ఉన్న ఇరానీయులు కూడా ఆయన మృతిని ఓ పండుగల సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం ముందు ఇరానీయులు వచ్చి సంబరాలు చేసుకున్నారు. కొందరు స్వీట్లు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Fireworks throughout Iran, including here in Saqqez, Iranian Kurdistan — home of #MahsaAmini Iranians rejoice at the thought of #RaisiTheButcher karmic death pic.twitter.com/QNt6zF87Sy — Mariam Memarsadeghi (@memarsadeghi) May 19, 2024 ఈ సంబరాలపై మహిళా హక్కుల కార్యకర్త మాసిహ్ అలినేజాద్ (Masih Alinejad) ఎక్స్ వేదిగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడితే చరిత్రలో ఆందోళన కలిగించే ఏకైక క్రాష్ ఇదే అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ హెలికాప్టర్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కాగా, రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా క్రూరంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇస్లామిక్ అచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు. ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో (Iraq-Iran War) చిక్కిన ఖైదీలను రైసీ దారుణంగా ఉరి వేయించాడని, ఆయన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కూడా రైసీ కఠినంగా శిక్షించినట్ల ఆరోపణలు ఉన్నాయి. రైసీ పట్ల ఇరాన్ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు స్థానిక మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మృతిని ఇరాన్ ప్రజలు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. Also read: వేసవి వేడి నుంచి తప్పించుకోవడానికి ఈ సత్తు తక్షణ ఉపశమనం.. #accident #celebrations #iran #ebrahim-raisi #helicopter-crash మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి