Iran President Death: ఇరాన్‌ అధ్యక్షుడి మరణం వెనుక ఆ దేశ పెద్దల హస్తం ఉందా? 

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఆ దేశ పెద్దల హస్తమే ఉందా. రాజకీయ కారణాలతోనే ఆయనను టార్గెట్ చేశారా? విదేశీ కుట్ర కంటే.. స్వదేశీ రాజకీయమే దీనికి కారణం అయి ఉండవచ్చని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ అనుమానాల వెనుక కథ ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు

New Update
Iran President Death: ఇరాన్‌ అధ్యక్షుడి మరణం వెనుక ఆ దేశ పెద్దల హస్తం ఉందా? 

Iran President Death: స్పేస్ లేజర్ ద్వారా ఆకాశం నుంచి పేల్చారు.. ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాఫ్టర్‌ ప్రమాదంపై ఓ వర్గం చేస్తున్న ప్రచారం ఇది.. నిజానికి ఇబ్రహీం రైసీ మరణం తర్వాత అందరి వేలు ఒక్కసారిగా ఇజ్రాయెల్‌వైపు వెళ్లింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో సాధారణంగా అందరూ ఇజ్రాయెల్‌నే అనుమానిస్తారు. కానీ ఇబ్రహీం రైసీ మరణం ప్రమాదం కాదని.. ఇరానే దగ్గురుండి చేయించిందన్న వాదన కూడా ఉంది. ఇది వారసత్వ యుద్ధంలో భాగంగా చెబుతున్నారు. మరోవైపు అంతరిక్షం నుంచి రైసీని మట్టుబెట్టారన్న ప్రచారమూ ఉంది.. ఇలా ఒక మరణం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.. ఇంతకీ అసలు నిజమేంటి..?

Iran President Death: ఇబ్రహీం రైసీ మరణం షియా దేశాన్ని రాజకీయ శూన్యతలో వదిలేసిందా అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. అసలు రైసీ మరణం వెనుక ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హస్తముందన్న వాదనను పలువురు విశ్లేషకులు వినిపిస్తున్నారు. ఇదేంటి.. ఖమేనీనే కదా రైసీని అధ్యక్షుడిగా నిలబెట్టిందని డౌట్ పడుతున్నారా? ఇక్కడే ఉంది అసలు కథ. ఇరాన్‌లో సుప్రీం లీడర్‌ పదవి అధ్యక్ష పదవి కంటే పవర్‌ఫుల్‌. 85 ఏళ్ల సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కువ కాలం ఈ పదవిలో కొనసాగే పరిస్తితి లేదు. ఖమేనీ ఈ పదవిని వీడిన తర్వాత రైసీ ఈ స్థానానికి వస్తాడన్నది అంచనా. అయితే తదుపరి సుప్రీం లీడర్‌గా తన కుమారుడు మోజ్తాబా ఖమేనీ ఉండాలని అలీ ఖమేనీ భావిస్తున్నాడని అమెరికా వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగా కావాలనే ఇబ్రహీం రైసీని చంపినట్టుగా అమెరికా అనుకూలిత వర్గం ఆరోపిస్తోంది.

Iran President Death: హెలికాప్టర్‌ను నడుపుతున్న పైలట్ ఈ కుట్ర వెనుక ఉన్నాడని.. అతని ద్వారానే ఖమేనీ ఈ హత్యకు ప్లాన్‌ చేశాడని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఇది ముమ్మాటికి హత్యేనన్న అనుమానాలను వ్యక్తం చేసేవారి సంఖ్య సోషల్‌మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే మూడు హెలికాఫ్టర్లు ఉన్న కాన్వాయ్‌లో రెండు సురక్షితంగా ఉండడం.. అధ్యక్షుడి హెలికాఫ్టర్‌ మాత్రమే క్రాష్‌ అయ్యింది. ఇది ఎలా సాధ్యమన్నది వారి వాదన. అయితే ఇజ్రాయెల్‌పై అనుమానాలు బలపడకుండా ఉండేందుకే అమెరికా ఈ విధమైన ప్రచారం చేస్తుందని యూఎస్‌ వ్యతిరేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్నారు

Iran President Death: మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్‌ హెలికాప్టర్‌ను స్పేస్ లేజర్ ద్వారా ఆకాశం నుంచి పేల్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఎలా పని చేస్తుందో తెలిపే విజువల్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నిజానికి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అనేది కుట్ర సిద్ధాంతం కాదు. ఈ సాంకేతికతను ఇప్పటికే పలు దేశాలు ఉపయోగించే దశలో ఉన్నాయి. అయితే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై లేజర్ దాడి జరిగిందని రుజువు చేసేందుకు ఎలాంటి కనీస ఆధారాలు, నివేదికలు లేవు.

Iran President Death: అటు అమెరికా, ఇజ్రాయెలే రైసీని చంపేశాయని ఇరాన్‌ అనుకూలిక వర్గాలు చెబుతున్నాయి. రైసీ ప్రయాణిస్తున్న ఛాపర్ కూలిపోవడానికి విమానయాన భాగాలపై అమెరికా విధించిన ఆంక్షలే కారణమని ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి మహ్మద్ జావద్ జరీఫ్ ఆరోపించారు. నిజానికి ఇరాన్ ఇప్పటికీ కాలం చెల్లిన అమెరికన్ కాప్టర్లపైనే ఆధారపడుతోంది. ఇక ఇరాన్ అణు శాస్త్రవేత్త మొహసేన్ ఫక్రిజాదే 2020లో టెహ్రాన్ సమీపంలో హత్యకు గురయ్యారు. రిమోట్ కంట్రోల్‌ ఆధారిత ఆయుధంతో ఫక్రిజాదేని చంపేశారు. నాటి ఫక్రిజాదేతో పాటు ఇప్పుడు ఇబ్రహిం రైసీ మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తముందన్నది పలువురి అభిప్రాయం. ఇదంతా ఇజ్రాయెలే చేస్తుందన్నది వారి అనుమానం. అయితే ఈ సిద్ధాంతాలు, థియరీలు, అనుమానాలు ఎంతవరకు నిజమో అనేది ఇప్పటికైతే చెప్పలేం!

Advertisment
Advertisment
తాజా కథనాలు