Rohit Sharma: నాకు ఆ రూల్ నచ్చలేదు.. ఇలాగైతే ఆల్‌రౌండర్లు ఎదగలేరు! ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'ఈ నిబంధన నాకు నచ్చలేదు. ఇది భారత క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు ఇది అడ్డంకిగా మారింది. క్రికెట్ కోణంలో పరిశీలిస్తే అసలే సరైనది కాదు' అన్నాడు. By srinivas 18 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL: ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై భారత సారథి, ముంబై ఇండియన్స్ సీనియర ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2023 నుంచి ఈ రూల్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దీని వల్ల ప్రతీ జట్టు మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆడిస్తారు. పిచ్ అనుకూతను బట్టి ఇంపాక్ట్ ఆటగాడిగా తీసుకుంటారు. అయితే ఈ నిబంధన వల్ల చాలా జట్లు ప్రయోజనం పొందుతున్నాయి. కానీ ఈ రూల్‌పై రోహిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. pic.twitter.com/1FtmrYebfQ — Rohit Sharma (@ImRo45) March 19, 2024 ఆల్‌రౌండర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారు.. ఈ మేరకు తాజాగా దీనిపై మాట్లాడిన హిట్ మ్యాన్.. ఈ నిబంధన వల్ల శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని చెప్పాడు. ఇది భారత క్రికెట్‌కు అంత మంచిది కాదన్నాడు. ‘ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు ఈ రూల్ అడ్డంకిగా మారిందని భావిస్తున్నా. ఎందుకంటే క్రికెట్‌ను ఆడించాల్సింది 11 మందితోనే. 12 మంది కాదు. నాకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం ఇలా చేస్తున్నారు. కానీ, క్రికెట్ కోణంలో పరిశీలిస్తే.. సరైనది కాదు. నేను మీకు చాలా ఉదాహరణలు చెప్పగలను. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె వంటి వారు బౌలింగ్ చేయడం లేదు. ఇది మాకు (భారత జట్టు) మంచిది కాదు’ అని రోహిత్ అన్నాడు. ఇది కూడా చదవండి: Chhattisgarh: కంకేర్ ఎన్ కౌంటర్.. అమరుల లిస్ట్ రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ! ఇదిలావుంటే ఈ సీజన్‌లో ముంబై ఆటతీరుపై స్పందిస్తూ.. ‘ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదు. ఈ సీజన్‌లో పేలవంగా ఆరంభించినా ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చినప్పుడు ఇలా జరుగుతుందంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. #rohit-sharma #ipl-impact-player మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి