IPL 2024: ధోనీ రికార్డును మిస్ చేసుకున్న పాట్ కమిన్స్..

అంతర్జాతీయ, ఐపీఎల్ కెప్టెన్సీలో ధోనీ ఫీట్‌ను సమం చేసే అరుదైన అవకాశాన్ని పాట్ కమిన్స్ కొద్దిలో మిస్ చేసుకున్నాడు. నిన్న జరిగిన ఐపీఎల్ 2024లో మ్యాచ్ లో కమిన్స్ ఆ ఫీట్ ను కోల్పోయాడు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

New Update
IPL 2024: ధోనీ రికార్డును మిస్ చేసుకున్న పాట్ కమిన్స్..

ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా 10.3 ఓవర్లలో 57 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం ద్వారా ధోనీ రికార్డును సమం చేసే అరుదైన అవకాశాన్ని పాట్ కమిన్స్ కోల్పోయాడు.

అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ICC ట్రోఫీని, IPL జట్టు కెప్టెన్‌గా IPL ట్రోఫీని గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ధోని. అతను మూడు ICC ట్రోఫీలకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్ 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీ. అదేవిధంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు మరే కెప్టెన్ ఈ ఘనత సాధించలేకపోయాడు. ఉదాహరణకు, రోహిత్ శర్మ IPL జట్టు (ముంబయి ఇండియన్స్) కెప్టెన్‌గా ఐదుసార్లు IPL ట్రోఫీని గెలుచుకున్నాడు. అయితే, అతను భారత జట్టు కెప్టెన్‌గా ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయాడు. 2023 టెస్ట్ ఛాంపియన్‌షిప్ , 2023 ICC ODI ప్రపంచ కప్ సిరీస్‌లో భారత్ ఫైనల్స్‌కు చేరుకుంది, కానీ ఓటమి పాలైంది. దాంతో రోహిత్ శర్మ ఆ ఛాన్స్ మిస్సయ్యాడు.

పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా 2023 వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్న అతను ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునే అవకాశం ఉంది. కానీ ఫైనల్లో కోల్‌కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోవడంతో కమిన్స్ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. దీని తర్వాత,ICC ట్రోఫీ IPL ట్రోఫీని గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్క్ శంకర్‌ను కాపాడిన సింగపూర్ స్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. పవన్‌‌తో మోదీ మాట్లాడి.. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

author-image
By K Mohan
New Update
PM modi pK

PM modi pK Photograph: (PM modi pK)

సింగపూర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక సమాచారాన్ని వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ కూడా పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేసి మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి, బాబు ఆరోగ్య పరిస్దితి గురించి మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో పవన్‌ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి 7గంటలకు ఫ్లైట్‌లో సింగపూర్ బయలుదేరనున్నారు.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడికి చికిత్స కొనసాగుతోందని జనసేన లీడర్ తెలిపారు. జరిగిన ప్రమాదంపై పవన్‌ కళ్యాణ్‌తో మోదీ మాట్లాడారని ఆయన చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాని మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Also read: Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment