IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే.. ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే..!

ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు SRH జట్టు 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. అయితే తాజాగా SRH చివరి రెండు మ్యాచ్లలో ఓడిపోయి ప్లేఆఫ్స్ ను కష్ట తరం చేసుకుంది.దీంతో ఎస్ ఆర్ హెచ్ కు రానున్న ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది.

New Update
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే.. ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే..!

ఐపీఎల్ 2024 (IPL 2024) సెకండ్ హాఫ్‌లో సీన్లు రివర్స్ అవుతున్నాయి. ముందు నుంచి దూకుడుగా ఆడిన కొన్ని జట్లు ఇప్పుడు చతికిలపడుతుండగా, పాయింట్ల పట్టికలో నిన్న మొన్నటి వరకు చివర్లో ఉన్న టీమ్స్ వరుస విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానానికి పడిపోయింది. దీంతో ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 5 విజయాలు సాధించిన SRH, ప్లేఆఫ్ రేసులో మిగతా టాప్ టీమ్స్ కంటే కాస్త వెనుకపడింది.

నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన 46వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 78 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్.. రుతురాజ్‌ గైక్వాడ్ 98, డారిల్ మిచెల్‌ 52, శివం దూబె 39 స్కోర్లతో విజృంభించడంతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఫ్లాఫ్ షో కంటిన్యూ చేస్తూ, ఏకంగా 9 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు.

ఛేదనలో సన్‌రైజర్స్, చెన్నైకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. బ్యాటర్లలో ఎవరూ 50 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. ట్రావిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15) ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించినా, ఆ తర్వాత జోరు కొనసాగించలేకపోయారు. హెన్రిచ్ క్లాసెన్ (20) సైతం బ్యాటుకు పెద్దగా పని చెప్పలేదు. ఐడెన్ మార్క్రామ్ (32) జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.నిన్నటి మ్యాచ్‌లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. లీగ్‌లో SRH ఇప్పటివరకు 5 విజయాలు, 4 ఓటములు సాధించింది. అయితే చెన్నైపై భారీ తేడాతో ఓడటంతో జట్టు నెట్ రన్ రేట్ (NRR) కొంత తగ్గి +0.075కి చేరుకుంది. ఇది ఇప్పటికీ బెస్ట్‌ అనే చెప్పుకోవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికీ ప్లేఆఫ్స్‌ రేసులో మెరుగైన స్థానంలోనే ఉంది. అయితే ఈ జట్టు టోర్నమెంట్‌లో ఆడాల్సిన చివరి 5 మ్యాచ్‌ల్లో కనీసం 3 గెలవాలి. దీంతో జట్టు మొత్తం పాయింట్లు 16కు చేరుకుంటాయి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్. చివరి 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచినా సరే, SRH రేసులో ఉంటుంది. అయితే ఈ సందర్భంలో NRR పెంచుకోవాలి. అంటే భారీ తేడాతో విజయాలు సాధించాలి. ఒకవేళ 4 మ్యాచ్‌లు ఓడిపోతే మాత్రం, జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలకు తెరపడినట్లే.

Advertisment
Advertisment
తాజా కథనాలు