జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు ఆహ్వానం.. పూర్తి అర్హతలివే

హైదరాబాద్‌లోని జేఎన్ టీయూ తమ పరిధిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌కు సంబంధించి నవంబర్‌ 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2023 డిసెంబర్‌ 15లోపు అప్లై చేసుకోవాలి.

New Update
జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు ఆహ్వానం.. పూర్తి అర్హతలివే

NTUH Online Admissions: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. తమ పరిధిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌కు సంబంధించి నవంబర్‌ 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌ కోర్సు వ్యవధి 6 నెలలు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. 1. సైబర్‌ సెక్యూరిటీ కోర్సులో సైబర్‌ సెక్యూరిటీ ఫండమెంటల్స్‌, ఈ-కామర్స్‌ అండ్‌ డిజిటల్ సెక్యూరిటీ, సైబర్‌ లాస్‌ అండ్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులు ఉంటాయి. 2. డేటా సైన్సెస్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ కోర్సులో ప్రోగ్రామింగ్ యూజింగ్‌ పైథాన్‌, మెషిన్ లెర్నింగ్ సబ్జెక్టులు ఈ కోర్సులో చదవల్సి ఉంటుంది. 3. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్ కోర్సులో.. పైథాన్‌ ఫర్‌ డేటా సైన్సెస్‌, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులు ఉంటాయి. అలాగే ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్ధులు తప్పనిసరిగా డిప్లొమా/ యూజీ/ పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఆన్‌లైన్‌ కోర్సులను ఆన్‌లైన్‌లో ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అందిస్తారు. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌ ద్వారా ఆయా కోర్సులకు సీట్లను కేటాయిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read :రూమ్ కొస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. ఈవీవీపై షకీలా ఆరోపణలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులను డిసెంబర్‌ 15, 2023వ తేదీలోపు సమర్పించాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.500 చెల్లించాలి. ఆ తర్వాత అడ్మిషన్‌ ఫీజు రూ.1,000, కోర్సు ఫీజు రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 15లోపు అప్లై చేసుకోని వారికోసం లేటు ఫీజు రూ.500తో 2023 డిసెంబర్‌ 22 సాయంత్రం 4 గంటల అవకాశం కల్పించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Saif Ali Khan: కత్తితో దాడి తర్వాత సైఫ్.. ఆ దేశంలో కొత్త ఇల్లు కొనుగోలు!

హీరో సైఫ్ అలీఖాన్ మరో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఖతార్‌లోని సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో ఇల్లు కొన్నారు. అక్కడ యాంబియెన్స్ తో పాటు మంచి భద్రత కూడా ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలలకు సైఫ్ కొత్త ఇల్లు కొన్నారు.

New Update
saif ali khan buys second house at qatar

saif ali khan buys second house at qatar

Saif Ali Khan  బాలీవుడ్ హీరో సైఫ్ తాజాగా మరో ల‌గ్జ‌రీ ఇంటిని కొనుగోలు చేశారు. అరబ్ దేశంలోని ఖతార్‌లో ది సెయింట్ రెజిస్ మార్సా అరేబియా ద్వీపంలో  విలాసవంతమైన ఇంటిని కొన్నారు. ఈ విషయాన్ని సైఫ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ల‌గ్జ‌రీ ఇంటి గురించి సైఫ్ మాట్లాడుతూ..  'నేను హాలిడే హోమ్ లేదా రెండవ ఇంటి గురించి ఆలోచించేటప్పుడు .. చాలా విషయాల గురించి ఆలోచిస్తాను. ముందుగా అది చాలా దూరంలో కాకుండా, సులభంగా చేరుకునేలా ఉండాలని అనుకుంటాను. ఈ ఇల్లు ఎంతో అందంగా ఉండడంతో పాటు సురక్షితమైనది అని పేర్కొన్నారు. భార్య కరీనా కపూర్,   పిల్లలు తైమూర్,  జెహ్‌ని త్వరలోనే  ఇక్కడికి తీసుకురావడానికి  చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు సైఫ్.

కత్తితో దాడి తర్వాత.. 

సైఫ్ తనపై కత్తితో దాడి జరిగిన కొన్ని నెలలకు ఈ కొత్త ఇంటికి కొనుగోలు చేశారు. దాడి తర్వాత 5 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు సైఫ్. ఇక సైఫ్ ఆస్తుల విషయానికి వస్తే ..  బాంద్రాలో ఒక అపార్ట్‌మెంట్,  పటౌడి ప్యాలెస్ ఉన్నాయి. ఇది కాకుండా, అతనికి లండన్,  గ్స్టాడ్ (స్విట్జర్లాండ్) లలో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

latest-news | cinema-news | saif-ali-khan

Also Read: Allu Arjun- Atlee: అల్లు అర్జున్ లుక్ టెస్ట్ .. 12 ఏళ్ళ పిల్లలతో ఊహించని యాక్షన్ సీక్వెన్స్

Advertisment
Advertisment
Advertisment