విడాకుల కోసమే ఈ ఆలయం, ఇదెక్కడుందో మీకు తెలుసా? మనం బోల్డన్నీ కోరికలతో గుళ్లు గోపురాలకు వెళ్తాం. పరీక్ష పాసవ్వాలని, మంచి ఉద్యోగం దొరకాలని, చక్కటి భార్య రావాలని, ఫారన్ వెళ్లాలని.. దేవుడిని ఇలాంటివన్నీ కోరుకుంటాం. సహజంగానే భక్తుల కోరికలు తీర్చే ఆలయాలు చాలా రద్దీగా ఉంటాయి. కానీ విడాకులకు కూడా ఒక ఆలయం ఉంది తెలుసా?. ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోతున్నాయి అనుకుంటున్నారా? ఔను.. మీరు విన్నది కరెక్టే.. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా..? By Shareef Pasha 20 Jun 2023 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి విడాకుల ఆలయం పేరు మాస్తుగావోకా టోకీజీ.. ఇది జపాన్ దేశంలో ఉంది. సుమారు ఆరు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఘనమైన సంస్కృతి సంప్రదాయాలున్నాయి. ఈ గుడిని డైవర్స్ టెంపుల్ అని పిలుస్తుంటారు. అంటే విడాకుల దేవాలయం అన్నమాట. 1285లో బౌద్ద భిక్షువు కాకుసాన్ షిదో-నీ ఈ గుడిని నిర్మించారు. ప్రముఖ బౌద్ధ మందిరంగా పేరుపొందిన ఈ ఆలయంలో అప్పట్లో నిస్సహాయులైన మహిళలకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చేవారు. ఆ రోజుల్లో మహిళల పరిస్థితి ఘోరంగా ఉండేది. పురుషాహంకారం బుసలు కొడుతుండేది. మహిళలను చిన్నచూపు చూసేవారు. సమాజంలో వారికి ఎలాంటి అధికారాలు ఉండేవి కాదు. ఎన్నో సామాజిక కట్టుబాట్లను విధించేవారు. గృహ హింసకు గురయ్యేవారు. కఠినమైన నిబంధనల వల్ల బాధపడుతున్న... మహిళలంతా ప్రశాంతత కోసం మాస్తుగావోకా టోకీజీ గుడికి వస్తుండేవారు. అప్పట్లో వివాహబంధాలు ఎక్కువ రోజులు ఉండేవి కావు. విడాకుల తంతు జోరుగా ఉండేది. అలా భర్తతో తెగదెంపులు తీసుకున్న ఒంటరి మహిళలు ఇక్కడకు వచ్చి ఆశ్రయం పొందేవారు. అలాంటి మహిళలకు విడాకుల ధృవ పత్రాలను ఇచ్చేవారు. ఆ విధంగా వారికి స్వేచ్ఛగా ఉండే హక్కును ప్రసాదించేవారు. మాస్తుగావోకా టోకీజీ గుడిలో ఓ సంగ్రహాలయం కూడా ఉంది. ఇందులో ఆలయ చరిత్రకు సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి. ఇది బౌద్ధ మందిరం కాబట్టి ఆ మతానికి చెందిన ధార్మిక సమావేశాలు ఇక్కడ జరుగుతుండేవి. ఇప్పటికీ బౌద్ధ బిక్షువులు, నన్‌లు ఇక్కడికి వచ్చేవారికి వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తుంటారు. ఇప్పటికీ ఈ ఆలయానికి మహిళలు పరుషులు వస్తుంటారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న విడాకుల కేసుల్లో తొందరగా తీర్పు రావాలని.. అదీ తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారని ఆలయ సంరక్షకులు చెబుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి