/rtv/media/media_files/2026/04/17/women-2026-04-17-15-55-47.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నెవాడా, అరిజోనా రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతుండగా, ఆయన వెంటే ఒక మహిళ పెద్ద ఎర్రటి బ్యాగును పట్టుకుని లోపలికి వెళ్లడం వీడియోలో కనిపించింది. ఈ చిన్న క్లిప్ కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, అసలు ఈమె ఎవరు? ఆ బ్యాగులో ఏముంది? అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు దీన్ని ఒక పెద్ద మిస్టరీలాగా చిత్రీకరిస్తే, మరికొందరు మాత్రం సాధారణ విషయాన్ని కూడా కుట్రగా మారుస్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
Mysterious woman with large red bag seen getting on Air Force One behind President Trump 👀 pic.twitter.com/RjfLWDGmzs
— Matt Wallace (@MattWallace888) April 16, 2026
ఎవరో క్లారిటీ వచ్చేసింది
అయితే ఈ చర్చలకు తెరదించుతూ ఆమె ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఆమె మరెవరో కాదు, ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సహాయకురాలు నటాలీ హార్ప్. 35 ఏళ్ల నటాలీ హార్ప్ గతంలో టెలివిజన్ ప్రెజంటర్‌గా పనిచేశారు. 2025 నుంచి ఆమె ట్రంప్ వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ ఎక్కడికి వెళ్లినా ఆమె దాదాపు ఆయన వెంటే ఉంటారు. ఆయన సమాచార వ్యవహారాలను, సోషల్ మీడియా పోస్టులను ఆమె దగ్గరుండి చూసుకుంటారు. అందుకే ఆమెను చాలామంది హ్యూమన్ ప్రింటర్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు.
రకరకాల కామెంట్లు
ఇక నటాలీ హార్ప్ ఎప్పుడూ కూడా కెమెరా వెనుక ఉండి తన పని తాను చేసుకుపోతుంటారు తప్ప, పెద్దగా ప్రచారానికి ఇష్టపడరు. ఆమెకు కొంత మిస్టరీ ఇమేజ్ ఉండటానికి ఇదే కారణం అని ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ ఎర్రటి బ్యాగులో నేనే ఉన్నానని ఒకరు జోక్ చేయగా, "ఇందులో వింతేముంది? ఆమె ఎప్పటినుంచో ట్రంప్ టీమ్‌లో ఉన్నారు కదా" అని మరికొందరు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ఆ వైరల్ వీడియోలో ఉన్నది ట్రంప్ నమ్మకస్తురాలైన సహాయకురాలే అని తేలిపోవడంతో ఈ మిస్టరీకి ఎండ్ కార్డ్ పడింది.
Follow Us