Ukraine: ఇంక చేయలేము..చేతులెత్తేస్తున్న ఉక్రెయిన్ సైనికులు ఈ యుద్ధం ఇంక మేము చేయలేము బాబోయ్ అంటున్నారు ఉక్రెయిన్ సైనికులు. కాల్పుల విరమణ చర్చలు మొదలయ్యేలోపు ఉక్రెయిన్ బలహీనంగా తయారుతోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా దండెత్తినప్పటి నుంచి ఇంతవరకు లక్షమంది ఉక్రెయిన్ సైనికులు యుద్ధరంగం వదలి పారిపోయారు. By Manogna alamuru 30 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి యుద్ధరంగం నుంచి ఉక్రెయిన్ సైనికులు పారిపోతున్నారు. గడిచిన ఏడాదిలో 50 వేలమంది ఉక్రెయిన్ సైనికులు సెలవు పెట్టకుండానే ఎక్కడికో వెళ్ళిపోయారు. రష్యా దాడులకు ఉక్రెయిన్ సైనికులు బెంబేలెత్తిపోతున్నారు. యుద్ధం చేయలేక అలసిపోతున్నారు. 18 ఏళ్లుపైబడినవారినీ సైన్యంలోకి తీసుకోవాలని అమెరికా కీవ్‌పై ఒత్తిడి తెస్తోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా దండెత్తినప్పటి నుంచి ఇంతవరకు లక్షమంది ఉక్రెయిన్ సైనికులు యుద్ధరంగం వదలి పారిపోయారు. నిజానికి వీరి సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని అనధికార అంచనా. వైద్య, ఆరోగ్య కారణాలు చెప్పి మెడికల్ లీవ్ తీసుకుంటున్న సైనికులు మళ్ళీ తిరిగి రావడం లేదు. రష్యా విపరీతంగా దాడులు చేస్తోంది. అది మాపై 50 సారి కాల్పులు జరిపితే..మేము ఒక్కసారి మాత్రమే కాల్పులు జరపగలుగుతున్నాము అని సైనికులు చెబుతున్నారు. మా కళ్ళ ముందే ఎంతో మంది మిత్రులు చనిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నామని చెబుతున్నారు ఉక్రెయిన్ సైనికులు. యుద్ధం ఎంతకూ ముగియకపోవడంతో సైన్యం పెద్ద బందిఖానాలా తయారైందని మరో సైనికుడు చెప్పాడు. శస్త్రచికిత్సకని బయటకువెళ్లిన ఆ సైనికుడు మళ్లీ తిరిగిరాలేదు. మా పై అధికారులు మాత్రం మమ్మల్ని ముందు వెళ్ళండి అని పుష్ చేస్తున్నారని వాపోతున్నారు. అలా అయితే యుద్ధాన్ని ఆపేస్తాం... ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ...యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ భూభాగానికి నాటూ భద్రత కల్పిస్తామని హామీ ఇస్తే...తాము కాల్పుల విరమణకు అంగీకరిస్తామని జెలెన్ స్కీ చెప్పారు. ఆ తర్వాత రష్యా ఆక్రమిత ప్రాంతాలతో కలిపి మా దేశాన్ని నాటోలో చేర్చుకోవాలి. అలా జరిగితే రష్యా ఆక్రమించుకున్న భూభాగం మాకు దక్కుతుంది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు. కానీ దీనికి రష్యా ఒప్పుకుంటుందని తాము అనుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాటోలోని ఏ దేశమూ తమకు ఈ విధమైన హామీ ఇవ్వలేదన్నారు. మమ్మల్ని ఎప్పటికైనా నాటోలో చేర్చుకుంటారా అనేది సందేహమే..! ఇప్పటివరకు మాకు దీనిపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని జెలెన్ స్కీ చెప్పారు. Also Read: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి