/rtv/media/media_files/2026/04/12/fotojet-53-2026-04-12-21-31-07.jpg)
Russia mediation Iran US
Russia mediation Iran US : పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఆ దేశంలో జరిగిన అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో సుమారు 21 గంటల పాటు జరిగిన కీలక చర్చలు పూర్తిగా విఫలమవ్వడంతో అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీవాన్స్ అర్థంతరంగా చర్చల నుంచి వెళ్లిపోయాడు.
ఈ చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందమూ కుదరకుండానే ముగిశాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫేయిల్ కావడంతో మరో దేశం రష్యా మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాము సిద్ధమని ప్రకటించింది.
ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడి శాంతి ప్రయత్నాలకు సహాయం చేస్తామని ప్రకటించారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు తమవంతు సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఫుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌కు చెప్పినట్టు క్రెమ్లిన్ వెల్లడించింది. 'పశ్చిమాసియాలో సంఘర్షణకు రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారం కనుగొనడానికి, పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని సాధించే ప్రయత్నాలకు మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వ్లాదిమిర్ పుతిన్ నొక్కి చెప్పారు' అని క్రెమ్లిన్ పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉండగా, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విజయ వంతం కావాలని ప్రపంచమంతా కోరుకుంది. కానీ, అవి విఫలం కావడంతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చర్చలలో పురోగతిని సాధించలేకపోవడం, ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి సుస్థిరమైన ముగింపు లభించకపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది' అని యూకే ఆరోగ్య మంత్రి వెస్ స్ట్రీటింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇస్లామాబాద్ చర్చలు ఒప్పందం లేకుండా ముగియడం నిరాశపరిచిందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వాపోయారు. వీరే కాక ప్రపంచంలోని చాలా దేశాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇక మీదట రష్యా మధ్యవర్తిత్వంతోనైన రెండుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని ఆశీద్దాం.
Follow Us