గాజాలో బందీలుగా ఉన్నవారిని విడుదల చేయాలి: అమెరికా

గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిపి వేలమందిని పొట్టనకొట్టుకుంది. ఈ ఘటనలో వేలమంది చనిపోగా మిగతా వారిని చెరలో బంధించారు. వీరిని కుటుంబాలకు చేరవేసినంత వరకు నిద్రపోమని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.

New Update
gaja

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిపి ఏడాది కావస్తోంది. ఈ ఘటనలో ఎందరో వేలమంది మృతి చెందగా.. కొందరిని హమాస్ బంధించింది. ఇప్పటికీ వారు హమాస్ చెరలోనే బందీలుగా ఉన్నారు. అయితే హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని అమెరికా పిలుపునిచ్చింది. చెరలో ఉన్న బందీలను వారి కుటుంబాలకు సురక్షితంగా చేరవేసినంత వరకు శ్రమిస్తామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: ప్రముఖ పారిశ్రామికవేత్త బజాజ్ కుమార్తె మరణం.. తీవ్ర విషాదంలో కుటుంబం

ఏడాది కిందట..

గతేడాది అక్టోబర్ 7న జరిగిన దాడుల్లో 46 మంది అమెరికన్లు మరణించగా.. 19 మంది అమెరికన్లు ఉన్నారని మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన మృతులకు సంతాపం తెలియజేస్తూ.. బందీలను బయటకు తీసుకురావడానికి శ్రమిస్తామని తెలిపారు. బందీలను బయటకు తీసుకురావడానికి కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Mexico: మేయర్‌ దారుణ హత్య..తల నరికి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు