America-Iran: సుప్రీం లీడర్ సంతకం లేకుండానే అమెరికా-ఇరాన్ ఒప్పందం.. అసలు చెల్లుబాటు అవుతుందా?

ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ సంతకం పెట్టరని అమెరికా అత్యున్నత అధికారి తెలిపారు. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో, సర్వోన్నత నాయకుడు అంతర్జాతీయ ఒప్పందాలపై నేరుగా ఎప్పుడూ సంతకాలు చేయరన్నారు.

New Update
donald trump

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 107 రోజుల పాటు సాగిన యుద్ధానికి శాంతి ఒప్పందంతో ఇరు దేశాలు ముగింపు పలికాయి. అయితే ఈ ఒప్పందంపై ఇరు దేశాలు ఇంకా సంతకం చేయనున్నాయి. ఈ క్రమంలో ఓ ప్రశ్న అందరిలో మొదలైంది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ఒప్పంద పత్రాలపై సంతకం చేస్తారా? లేదా? అనే సందిగ్ధత స్టార్ట్ అయ్యింది. సుప్రీం లీడర్ సంతకం లేకుండా.. ఈ ఒప్పందానికి చట్టబద్ధత ఉంటుందా? ఇది భవిష్యత్తులో నిలుస్తుందా? అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Strait of Hormuz: హర్మూజ్‌లో నో టోల్ ఫీజ్.. కానీ సర్వీస్ ఛార్జీలు కట్టాల్సిందే.. అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్

ఒప్పందం చెల్లుబాటు అవుతుందా?

ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు క్లారిటీ ఇచ్చారు. ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ సంతకం పెట్టరనే విషయం తమకు ముందే తెలుసన్నారు. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో, సర్వోన్నత నాయకుడు అంతర్జాతీయ ఒప్పందాలపై నేరుగా ఎప్పుడూ సంతకాలు చేయరని అమెరికా అధికారులు వెల్లడించారు. గతంలో 2015లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుదిరిన అణు ఒప్పందం (JCPOA)పై కూడా అప్పటి సుప్రీం లీడర్ సంతకం చేయలేదు. వారి వ్యవస్థలో అటువంటి కాగితపు ఒప్పందాలపై సంతకం చేయడం సర్వోన్నత నాయకుడి పాత్ర కాదు. అందువల్ల ఈ ఒప్పందంలో మొజ్తబా ఖమేనీ సంతకం చేయనంత మాత్రాన ఒప్పందం చెల్లుబాటుపై ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేదా ప్రశ్నలు తలెత్తవని తేల్చి చెప్పారు.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్.. టెలిగ్రాం బ్యాన్

మరి సుప్రీం లీడర్ సంతకం చేయకపోతే ఇరాన్ తరపున ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఎవరు ఖరారు చేశారు? అనే ప్రశ్నకు కూడా అమెరికా సమాధానం ఇచ్చింది. ఇరాన్ రాజ్యాంగం, వ్యవస్థ ప్రకారం ఇటువంటి అంతర్జాతీయ ఒప్పందాలను చర్చల ద్వారా ముగించి, సంతకం చేసే పూర్తి బాధ్యత ఆ దేశ పార్లమెంట్ స్పీకర్, ప్రధాన సంధానకర్త అయిన మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్‌పైనే ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంలో ఘాలిబాఫ్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నారని అమెరికా భావిస్తోంది. ఈ డీల్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయనే కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: America-Iran: యుద్ధం ఎఫెక్ట్.. ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.. పునర్నిర్మాణానికి రూ.25 లక్షల కోట్లు!

అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. మీడియా సమావేశాల్లో కానీ, అధికారిక కార్యక్రమాల్లో కానీ ఆయన ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించలేదు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆయన బయటకు రాకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అలాగే మొజ్తబాకు తీవ్ర గాయాలు అయ్యాయని, అతనికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని అందుకే సీక్రెట్ ప్లేస్‌లో ఉంచారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని నిరూపించేందుకు ఇరాన్ అధికారిక మీడియా యుద్ధం తర్వాత రెండు సార్లు వీడియోలను విడుదల చేసింది. కానీ ఆ వీడియోలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వీడియోలు నిజమైనవి కావు, అవి 'ఏఐ డీప్‌ఫేక్' అని ఆరోపణలు వచ్చాయి. 

ఇది కూడా చూడండి: NEET: నీట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అభ్యర్థుల అకౌంట్లు హ్యాక్

Advertisment
తాజా కథనాలు