/rtv/media/media_files/2026/03/27/pizza-2026-03-27-19-13-28.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువును మరో 10 రోజులు పొడిగించినట్లు ప్రకటించినప్పటికీ, తెరవెనుక యుద్ధ సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటి ఖర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా సైన్యం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.
ఏమిటీ పిజ్జా మీటర్?
యుద్ధం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి ఇదొక వింతైన, కానీ చాలా సందర్భాల్లో నిజమైన అంచనా పద్ధతి.గురువారం రాత్రి పెంటగాన్ సమీపంలోని పిజ్జా సెంటర్లకు ఆర్డర్లు ఒక్కసారిగా 200% నుండి 300% వరకు పెరిగాయి. దీనిని డౌకాన్ లెవల్ 3 గా పిలుస్తున్నారు. పెంటగాన్ లోని ఉన్నతాధికారులు, సైనిక వ్యూహకర్తలు రాత్రంతా మేల్కొని యుద్ధ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పుడు బయట నుంచి భారీగా ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. 1991 గల్ఫ్ యుద్ధం సమయంలో కూడా ఇలాగే పిజ్జా ఆర్డర్లు పెరగడం ద్వారా యుద్ధం మొదలవుతుందని ముందే పసిగట్టారు.
సైనిక నిపుణుల ప్రకారం, అమెరికా కేవలం గగనతల దాడులకే పరిమితం కాకుండా సైన్యాన్ని దింపడం దిశగా ఆలోచిస్తోంది. అమెరికా ముందు ప్రస్తుతం మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది హార్ముజ్ జలసంధిలో ఉన్న అతిపెద్ద ద్వీపమైన 'ఖేష్మ్ ఐలాండ్'ను స్వాధీనం చేసుకోవడం. ఇక్కడ ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లను దాచి ఉంచిందని అమెరికా నమ్ముతోంది. రెండవది ఇరాన్ చమురు వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఖర్గ్ ఐలాండ్‌పై దాడి చేయడం. ఇక మూడవది ఇరాన్ దగ్గర ఉన్నట్లు భావిస్తున్న 400 కిలోల యురేనియంను పట్టుకోవడం. ఇరాన్ చమురు మార్గాలను మూసివేస్తామని హెచ్చరించడంతో, ఆ దేశ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఈ వ్యూహాలను రచిస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు అని చెబుతూనే, మరోవైపు సైన్యాన్ని మోహరించడం ట్రంప్ మార్క్ మైండ్ గేమ్‌గా కనిపిస్తోంది.
Follow Us