Kharg Island : ఇరాన్ ఆర్థికశక్తిపై అమెరికా దాడులు... ఖర్గ్ ఐలాండ్‌ మటాష్‌

ఇరాన్‌పై అమెరికా దాడులు ఉదృతం చేసింది. ఇరాన్‌ ఆర్థికశక్తిపై అమెరికా దాడులకు తెగబడింది.ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా అటాక్‌ చేసింది.- ఖర్గ్‌ ఐలాండ్‌ను నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే చమురు సదుపాయాల జోలికి మాత్రం వెళ్లలేదనిప్రకటించింది.

New Update
FotoJet (10)

us attack Kharg Island

Kharg Island : ఇరాన్‌ పై అమెరికా దాడులు ఉదృతం చేసింది. ఇరాన్‌ ఆర్థికశక్తిపై అమెరికా దాడులకు తెగబడింది.- ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా అటాక్‌ చేసింది.- ఖర్గ్‌ ఐలాండ్‌ను నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే చమురు సదుపాయాల జోలికి మాత్రం వెళ్లలేదని అమెరికా ప్రకటించింది.హర్మూజ్ జలసంధి వద్ద ఆంక్షలు ఎత్తివేయకుంటే... ఖర్గ్‌లోని చమురు నిక్షేపాలనూ వదలనని అమెరికా వార్నింగ్ ఇచ్చింది.అమెరికా దాడితో ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.మా చమురు కేంద్రాలను టార్గెట్‌ చేస్తే- మీరు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది.

కాగా ఇరాన్‌ చమురు భాండాగారంగా ఖర్గ్ ద్వీపం ఉంది. ఖర్గ్‌ నుంచే 90శాతం చమురు ఎగుమతులు జరుగుతుంటాయి. - ఖర్గ్‌ నుంచి అత్యధికంగా చైనాకు చమురు సరఫరా చేస్తుంది.- రోజుకు 7మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఖర్గ్ ఐలాండ్‌కు ఉంది.- ఇరాన్ తీరానికి అతిదగ్గరలో ఖర్గ్ ఐలాండ్‌ ఉంది. తీరానికి- 30కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ ద్వీపం ఉంది. ఖర్గ్ ద్వీపం పర్షియన్ గల్ఫ్‌లో ఉంది. బుషేర్‌  హార్బర్‌కు వాయవ్యాన ఖర్గ్ ఐలాండ్ కనిపిస్తుంది.- ఖర్గ్ ఐలాండ్‌లో మంచినీటి వనరులూ లభ్యమవుతున్నాయి. 1960 నుంచి ప్రధాన చమురు టెర్మినల్‌గా ఖర్గ్ పేరుగాంచింది.- ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ ఆధీనంలో ఖర్గ్ ఐలాండ్ ఉంది.- ఖర్గ్‌ ఐలాండ్ ఫర్బిడెన్ ఐలాండ్‌గా పిలవబడుతుంది. ఖర్గ్ ఐలాండ్‌లో పురాతన చర్చిల ఆనవాళ్లు కూడా ఉన్నాయి.ఖర్గ్‌లో 18వ శతాబ్దపు డచ్‌ కోట వంటి పురాతన కట్టడాలు ఉన్నాయి.- సూపర్ ట్యాంకర్లు సైతం సులభంగా ఆగేలా ఖర్గ్ ఐలాండ్‌ను తీర్చిదిద్దారు.- ఖర్గ్‌ ఐలాండ్‌లో లోతైన జలాలు ఉన్నట్లు తెలుస్తుంది. అలాంటి ఖర్గ్ ఐలాండ్‌లోని సైనిక దళాలపై అమెరికా దాడి చేసినట్లు ప్రకటించింది. దాడికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌- బ్లాక్‌&వైట్ వీడియోను రిలీజ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు