/rtv/media/media_files/2026/03/25/us-army-2026-03-25-13-49-39.jpg)
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించగా పరిణామాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా తన పవర్‌ఫుల్ ఆర్మీ 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. యుద్ధాన్ని ఆపేందుకు ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ, మరోవైపు సైనిక సమీకరణలు ఇరాన్‌లోకి అమెరికా దళాల ప్రవేశానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
🇺🇸🇮🇷The U.S. is reportedly deploying about 1,000 elite paratroopers from the 82nd Airborne Division to the Middle East in the coming days.
— Mario Nawfal (@MarioNawfal) March 24, 2026
This adds firepower to the regional buildup even as Trump pushes his 15 point Iran peace plan.
Source: KVUE https://t.co/KQCbQhZNv2pic.twitter.com/7eqh3GH5hc
82వ ఎయిర్‌బోర్న్
అమెరికా సైన్యంలో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. "ఆల్ అమెరికన్" (AA) అనే గుర్తును ధరించే ఈ సైనికులు, ప్రపంచంలో ఎక్కడైనా కేవలం 18 గంటల వ్యవధిలో మోహరించగల సామర్థ్యం కలిగి ఉంటారు. పారాచూట్ ద్వారా యుద్ధ భూమిలోకి దూకడంలో వీరు దిట్ట. ఫోర్ట్ బ్రాగ్ కేంద్రంగా పనిచేసే ఈ విభాగం, ప్రతి నెలా సుమారు 10,000 ట్రైనింగ్ జంప్‌లు నిర్వహిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో సాహసోపేతమైన 'వాల్ నది' దాటుడు వంటి చారిత్రాత్మక విజయాలు వీరి సొంతం.
తాజా మోహరింపు వెనుక వ్యూహం
పెంటగాన్ నివేదికల ప్రకారం, ఇప్పటికే ఉన్న వేలాది మంది మెరైన్‌లకు అదనంగా సుమారు 3,000 మంది 82వ ఎయిర్‌బోర్న్ సైనికులు మధ్యప్రాచ్యానికి చేరుకుంటున్నారు. వ్యూహాత్మక చమురు మార్గాలను రక్షించడం, కీలక మౌలిక సదుపాయాలను కాపాడటం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు అమెరికా కేవలం వైమానిక దాడులకే (సుమారు 9,000 లక్ష్యాలు) పరిమితమైంది. అయితే, ఇప్పుడు భూతల దళాల మోహరింపు యుద్ధ గమనాన్ని మార్చవచ్చు.
చర్చలు Vs యుద్ధం
ఒకవైపు హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వల్ల ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ జరుపుతున్న డ్రోన్, క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా వాషింగ్టన్ తన రక్షణ కవచాన్ని బలపరుస్తోంది. ట్రంప్ చర్చల గురించి మాట్లాడుతున్నా, ఇరాన్ మాత్రం వాటిని ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తోంది.
ప్రస్తుతానికి ఇరాన్ గడ్డపైకి నేరుగా సైన్యాన్ని పంపే నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నా, సరిహద్దుల్లో పెరుగుతున్న ఈ 'పారాట్రూపర్ల' సంఖ్య ఏ క్షణమైనా పెద్ద యుద్ధానికి దారితీయవచ్చనే భయాందోళనలు కలిగిస్తోంది. రాబోయే కొద్ది రోజులు మధ్యప్రాచ్య భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
Follow Us