/rtv/media/media_files/2026/06/05/uno-2026-06-05-15-48-39.jpg)
UNO
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యురాలిగా ఉన్న పాకిస్తాన్ రెండేళ్ల పదవీకాలం కంప్లీట్ అయ్యింది. అయితే ఐక్యరాజ్యసమితిలో కొన్ని శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. మిగతావి మాత్రం తాత్కాలికంగా ఉంటాయి. ఎందుకు తాత్కాలిక సభ్య దేశాలకు కాలపరిమితి కేవలం రెండేళ్లు ఉంటుంది? అసలు ఈ ఐక్యరాజ్య సమితి రూల్స్ ఏంటి? ఇందులో శాశ్వత సభ్య దేశాలు ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం.
ఈ దేశాలకు వీటో అధికారం..
ఐక్యరాజ్యసమితిలో మొత్తం 193 దేశాలు ఉన్నప్పటికీ.. ప్రపంచ రక్షణ, శాంతి భద్రతలను పర్యవేక్షించే భద్రతా మండలిలో కేవలం 15 దేశాలకు మాత్రమే చోటు ఉంటుంది. అయితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా 5 శాశ్వత సభ్యదేశాలు ఈ ఐక్యరాజ్య సమితిలో ఉంటాయి. ఇవి రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచిన ఐదు అగ్రరాజ్యాలు ఈ ఐక్యరాజ్యసమితిని స్థాపించడంలో ముఖ్యపాత్ర పోషించాయి. ఆ కారణంగా వీటికి భద్రతా మండలిలో శాశ్వత స్థానాన్ని కల్పించారు. ఈ దేశాలకు ఎప్పటికీ ఎన్నికలు జరగవు. ఈ ఐదు శాశ్వత దేశాలకు ఉన్న వీటో అధికారం ఉంటుంది. ప్రపంచంలోని ఏ దేశమైనా భద్రతా మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు.. మిగిలిన 14 దేశాలు దానికి అనుకూలంగా ఓటు వేసినా... ఈ ఐదు శాశ్వత దేశాలలో ఏ ఒక్క దేశం ఇష్టం లేదని వీటో ఓటు వేస్తే ఆ తీర్మానం అక్కడికక్కడే రద్దయిపోతుంది. చైనా, రష్యా దేశాలు చాలాసార్లు భారత్కు వ్యతిరేకంగానో లేదా తమకు నచ్చని అంశాలపైనే ఈ వీటో పవర్ను వాడుతుంటాయి.
ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్ ఆయిల్ టర్మినల్పై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!
భద్రతా మండలిలో మిగిలిన 10 స్థానాలను తాత్కాలిక సభ్యత్వ దేశాలు అంటారు. పాకిస్తాన్ కూడా ఈ కేటగిరీ కిందనే ఎంటర్ అయ్యింది. ఈ దేశాలు ఐక్యరాజ్య సమితిలోకి ఎంటర్ కావాలంటే రూల్స్ ప్రకారం అంతర్జాతీయ ఎన్నికలు జరుగుతాయి. అయితే ప్రాంతాల వారీగా సీట్లు కేటాయించారు. ఆఫ్రికా, ఆసియా దేశాలకు 5 సీట్లు, లాటిన్ అమెరికా దేశాలకు 2 సీట్లు, పశ్చిమ ఐరోపా దేశాలకు 2 సీట్లు, తూర్పు ఐరోపా దేశాలకు 1 సీటు కేటాయించారు. ప్రతీ ఏడాది జూన్ నెలలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఓటింగ్ జరుగుతుంది. పోటీలో ఉన్న దేశానికి యూఎన్ఓలోని మొత్తం సభ్యదేశాలలో మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ ఓట్లు రావాలి. అంటే కనీసం 129 దేశాల మద్దతు లభిస్తేనే ఆ దేశం భద్రతా మండలిలో అడుగుపెట్టగలదు.
ఇది కూడా చూడండి: Annamalai's resignation : అన్నామలై రాజీనామా ఆమోదం..కొత్తపార్టీ దిశగా అడుగులు
రెండేళ్ల సమయం ఎందుకు?
ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి. కాలపరిమితి ఎక్కువగా ఉంటే చిన్న దేశాలకు అసలు అవకాశమే రాదు. రెండేళ్ల రూల్ వల్ల ప్రతి ఏడాది 5 పాత దేశాలు తప్పుకుని.. వాటి స్థానంలో 5 కొత్త దేశాలు వస్తుంటాయి. దీనివల్ల రొటేషన్ పద్ధతిలో ప్రపంచంలోని చిన్న, పెద్ద దేశాలన్నింటికీ ఐక్యరాజ్యసమితి వేదికపై తమ వాయిస్ వినిపించే అవకాశం దక్కుతుంది. ఏ ఒక్క దేశం కూడా భద్రతా మండలిలో సుదీర్ఘకాలం ఉండి తన సొంత రాజకీయ స్వార్థం కోసం అంతర్జాతీయ నిర్ణయాలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఈ రెండేళ్ల రూల్ పెట్టారు.
ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్ ఆయిల్ టర్మినల్పై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!
ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ప్రపంచ దేశాలన్నీ కొన్ని కఠినమైన రూల్స్ పాటించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ లాంటి ఒక దేశం తన 2 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకొని బయటకు వస్తే, అది వెంటనే జరిగే తదుపరి ఎన్నికల్లో మళ్లీ నిలబడటానికి వీల్లేదు. కనీసం ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చిన తర్వాతే మళ్లీ పోటీ చేయాలి. ప్రపంచంలోని ప్రతి దేశం సరిహద్దులను, స్వాతంత్ర్యాన్ని ఇతర దేశాలు గౌరవించాలి. బలహీనమైన దేశాలపై బలమైన దేశాలు అన్యాయంగా దాడులు చేయకూడదు. దేశాల మధ్య సరిహద్దు వివాదాలు లేదా ఆర్థిక గొడవలు వస్తే యుద్ధాలకు వెళ్లకుండా ఐక్యరాజ్యసమితి సమక్షంలో చర్చలు లేదా అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి.
ఇది కూడా చూడండి: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!
ఏదైనా దేశం ఐక్యరాజ్యసమితి రూల్స్ ఉల్లంఘించి పక్క దేశంపై దాడికి దిగితే ఆ దేశంపై భద్రతా మండలి ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది. ఇతర దేశాలు ఆ దేశంతో వ్యాపారాలు చేయకుండా నిలిపివేస్తాయి. ఒక దేశంలో జరిగే సొంత రాజకీయాలు లేదా అంతర్గత విషయాల్లో ఐక్యరాజ్యసమితి తలదూర్చదు. అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు మాత్రం ప్రత్యేక అనుమతులతో ఐక్యరాజ్య సమితి ఎంటర్ అవుతుంది. ఓ ప్రత్యేక సైనిక నిబంధనను అమలు చేస్తుంది. దీన్ని యూఎన్ పీస్కీపింగ్ ఫోర్స్ అంటారు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితికి సొంతంగా ఎలాంటి సైన్యం ఉండదు. కాబట్టి ప్రపంచంలోని సభ్యదేశాలన్నీ తమ సొంత సైనికులను ఐక్యరాజ్యసమితికి స్వచ్ఛందంగా పంపించాల్సి ఉంటుంది. ఈ సైనికులు నీలం రంగు హెల్మెట్లు ధరించి.. ఏ ఒక్క దేశం తరఫున కాకుండా కేవలం ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకే అక్కడ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు.
Follow Us