/rtv/media/media_files/2026/03/31/nato-2026-03-31-20-47-17.jpg)
NATO US TRUMP : ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం మూలంగా ప్రపంచమంతా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఇరాన్‌తో యుద్ధానికి సహకరించాలని ట్రంప్ గత కొంతకాలంగా నాటో దేశాలను కోరుతూ వస్తున్నాడు. అయితే ఆ దేశాలు యుద్ధానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో నాటో దేశాలకు మరోసారి ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. చమురు కావాలంటే అమెరికా లేదంటే.. హార్మూజ్ వెళ్లి తెచ్చుకోండంటూ ట్రంప్ ఆ దేశాలను హెచ్చరించాడు. మేము మీ కోసం యుద్ధం చేయము..మీకు చమురు కావాలంటే మీరే పోరాడండి అంటూ వారికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు.
హార్మూజ్ జలసంధీ మూసివేతతో..ప్రపంప వ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని దేశాలు అటు ఇరాన్, ఇటు అమెరికా మీద ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ రెండు దేశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో ఈ ప్రభావం భారతదేశంపై కూడా పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $115 డాలర్లకు చేరింది. దీంతో నాటో దేశాలపై ఒత్తిడి తెచ్చి ఇరాన్ మీద దాడిచేసేలా పరోక్షంగా నాటో దేశాలను ట్రంప్ యుద్ధంలోకి ఆహ్వానిస్తున్నాడు.-- ఇరాన్‌పై పోరాటానికి నాటో దేశాలను ఉసిగొలుపుతున్నాడు. హార్మూజ్‌ను తెరవకపోతే ఖార్గ్ ఐలాండ్‌ను పేల్చేస్తామంటూ గతంలో ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
అయితే నాటో దేశాలు మాత్రం ట్రంప్ మాట వినడానికి అంతా సిద్ధంగా లేవు. ఈ క్రమంలోనే ట్రంప్‌కు నాటో దేశాల బిగ్ షాక్ ఇచ్చాయి.ఇరాన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్‌పై మిత్ర దేశాల తిరుగుబాటు లేవనెత్తాయి. అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ ఎయిర్‌స్పేస్ మూసివేసింది. స్పెయిన్ బాటలోనే ఫ్రాన్స్, ఇటలీ కూడా నడుస్తున్నాయి. యూరప్‌లోని ఆర్మీ బేస్‌లను ఇరాన్‌పై దాడులకు... ఉపయోగించుకోనిచ్చేది లేదని నాటో దేశాలు ట్రంప్‌కు తెగేసి చెప్పాయి. దీంతో నాటో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఒంటరిగా మారింది. మిత్ర దేశాలు హ్యాండ్ ఇవ్వడంతో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు.నాటో నుంచి తప్పుకుంటానంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడు.--- మీ రక్షణ మీరే చూసుకోండంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. సభ్య దేశాలు GDPలో 5శాతం రక్షణ కోసం ఖర్చు చేయాలంటూ.. ట్రంప్ పెట్టిన నిబంధనతో NATOలో చీలిక వచ్చే ప్రమాదం ఏర్పడింది.
గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ వైఖరితోనూ నాటోలో విభేదాలు పొడచూపాయి. అమెరికాపై ఆధారపడకుండా ప్రత్యేక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో యూరప్ దేశాలు సన్నద్ధమవుతున్నాయి.నాటోలో చీలిక ఇరాన్‌కు వ్యూహత్మక విజయం అంటున్నారునిపుణులు. నాటో పతనం ఐతే రష్యా, చైనాకు పాజిటివ్‌గా మారే ఛాన్స్ ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
Follow Us