Donald Trump: ఆ పెళ్లికి వెళ్తే నన్ను చంపేస్తారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇరాన్' సమస్య నేపథ్యంలో ఒకవేళ నేను పెళ్లికి వెళ్లినా నన్ను విమర్శిస్తారు, వెళ్లకపోయినా నన్ను టార్గెట్ చేస్తారని వాపోయారు.

New Update
Trump

Trump

Donald Trump:  ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సంక్షోభంలో బిజీగా ఉండటం వల్ల ట్రంప్‌కు తన సొంత కుమారుడి పెళ్లికి వెళ్లేందుకు కూడా సమయం దొరకడం లేదు. గురువారం (మే 21) వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, "ప్రస్తుతం సమయం సరిగ్గా లేదు, అందుకే కొడుకు పెళ్లికి హాజరుకావడం కష్టంగా ఉంది" అని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధ వాతావరణం కారణంగా తన కుమారుడి పెళ్లికి తాను హాజరుకాలేని పరిస్థితి ఎదురవుతోందని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఈ వారాంతంలో పామ్ బీచ్‌కు చెందిన ప్రముఖ సోషలైట్ బెట్టీనా ఆండర్సన్‌తో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం జరగనుంది. అయితే ఈ పెళ్లి 'టైమింగ్' సరిగ్గా లేదని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.తాను పెళ్లికి హాజరవడానికి శతవిధాలా ప్రయత్నిస్తానని, అయితే ఇరాన్ ప్రస్తుత పరిస్థితులు, మీడియా నిరంతర నిఘా కారణంగా ఈ సమయంలో సమయం కేటాయించడం చాలా కష్టమని ట్రంప్ వివరించారు.

ట్రంప్ అసలు ఏమన్నారంటే..?

"నేను పెళ్లికి రావాలని నా కొడుకు కోరుకుంటున్నాడు, కానీ నాకు ఇది సరైన సమయం కాదు. నా ముందు 'ఇరాన్' లాంటి పెద్ద సమస్య ఉంది. ఒకవేళ నేను పెళ్లికి వెళ్లినా నన్ను విమర్శిస్తారు, వెళ్లకపోయినా నన్ను టార్గెట్ చేస్తారు (If I do attend, I get killed. If I don’t attend, I get killed). ఖచ్చితంగా ఇదంతా చేసేది మన 'ఫేక్ న్యూస్' (మీడియా) వారే."

ట్రంప్ జూనియర్ పెళ్లి ముచ్చట ఇలా ఉంటే, మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ పర్యటనకు బయలుదేరే ముందు ఇరాన్‌కు అణు ఆయుధాల విషయంలో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. "అవసరమైతే తీవ్ర చర్యలు ఉంటాయని" ఆయన స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడి కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారాంతంలో బహామాస్‌లో జరిగే ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. మీడియా నివేదికల ప్రకారం, ఆయన పామ్ బీచ్‌కు చెందిన ప్రముఖ సోషలైట్, మోడల్ బెట్టీనా ఆండర్సన్‌ను వివాహం చేసుకుంటున్నారు.'సీఎన్ఎన్' (CNN) నివేదిక ప్రకారం.. ఈ వివాహ వేడుకను అత్యంత వ్యక్తిగతంగా, నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. అతిథుల జాబితా చాలా పరిమితంగా ఉంది, ఇందులో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొంటారు. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పెళ్లికి హాజరవుతారా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు.
తన ఇండియా పర్యటనకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక కీలక ప్రకటన చేశారు. భారత్‌కు అవసరమైనంత ముడి చమురును సరఫరా చేయడానికి అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో భారత్‌కు చమురు కొరత రాకుండా చూసేందుకు అమెరికా ఈ హామీ ఇవ్వడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు