US-Israeli strikes : అమెరికా టొమాహాక్ విశ్వరూపం... ఇరాన్ గుండెల్లోకి దూసుకెళ్తున్న మృత్యు బాణం!

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ మీద విరుచుకుపడటంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఏకంగా 8 దేశాలపై క్షిపణులతో దాడులు ప్రారంభించి మరణ మృదంగం వాయిస్తోంది.

New Update
tomahawk missiles

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ మీద విరుచుకుపడటంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఏకంగా 8 దేశాలపై క్షిపణులతో దాడులు ప్రారంభించి మరణ మృదంగం వాయిస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నది మాత్రం అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన టొమాహాక్ మిసైల్. ఈ క్షిపణి సృష్టించిన బీభత్సం వల్ల టెహ్రాన్, చాబహార్ వంటి ముఖ్యమైన నగరాలు అగ్నిగుండంలా మారాయి.

టొమాహాక్ మిసైల్ అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ తంత్రంలో ఒక సంచలనం. దీన్ని ఒక క్రూయిజ్ మిసైల్ అని పిలుస్తారు. అంటే ఇది ఒక పైలట్ లేని విమానం లాంటిది అన్నమాట. ఒక్కసారి ప్రయోగిస్తే చాలు, అది తన లక్ష్యాన్ని తానే వెతుక్కుంటూ వెళ్లి నాశనం చేస్తుంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం నుంచి నేటి 2026 నాటి ఇరాన్ దాడుల వరకు అమెరికాకు ఇది ఒక ప్రధాన ఆయుధంగా మారింది. ఇది ఎంత వేగంగా వెళ్తుందంటే, శత్రువులకు తేరుకునే లోపే సర్వం తుడిచిపెట్టుకుపోతుంది.

ఈ క్షిపణిలో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఇది భూమికి చాలా తక్కువ ఎత్తులో (సుమారు 30 నుంచి 50 మీటర్లు) ప్రయాణిస్తుంది. దీనివల్ల శత్రువుల రాడార్లకు ఇది అస్సలు దొరకదు. పర్వతాల మధ్య నుంచి, లోయల గుండా దారి వెతుక్కుంటూ వెళ్లి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేస్తుంది. సుమారు 2,500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించినా సరే, లక్ష్యానికి కేవలం 5 నుంచి 10 మీటర్ల దూరంలోనే కచ్చితంగా పడుతుంది. అంటే ఎంతటి భారీ బిల్డింగ్‌నైనా, కరెక్ట్‌గా ఆ బిల్డింగ్ కిటికీ గుండా లోపలికి వెళ్లి పేలిపోయేంత టెక్నాలజీ దీని సొంతం.

 కొత్త వెర్షన్లు ఇంకా ప్రమాదకరమైనవి

టొమాహాక్ మిసైల్‌లో ఇప్పుడొచ్చిన కొత్త వెర్షన్లు ఇంకా ప్రమాదకరమైనవి. వీటిని ప్రయోగించిన తర్వాత కూడా గాల్లో ఉండగానే వాటి దిశను మార్చవచ్చు. ఒకవేళ దాడి చేయాల్సిన ప్రదేశాన్ని మార్చాలని అనుకుంటే, కంట్రోల్ రూమ్ నుంచి ఇచ్చే కమాండ్‌తో ఇది కొత్త లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. అవసరమైతే గంటల తరబడి గాల్లోనే తిరుగుతూ సరైన సమయం కోసం వేచి చూసే సత్తా దీనికి ఉంది.

ప్రస్తుతం అమెరికా తన యుద్ధ నౌకల నుంచి, సముద్ర గర్భంలోని సబ్ మెరైన్ల నుంచి ఈ క్షిపణులను ఇరాన్‌పైకి వదులుతోంది. ముఖ్యంగా తీర ప్రాంత పట్టణమైన చాబహార్‌పై టొమాహాక్ మిసైళ్లను వాడటానికి కారణం అదే. ఇరాన్ నావికా దళాన్ని, వారి అణు కేంద్రాలను, క్షిపణి గోదాములను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ వరుస దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థ దాదాపు కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంది.

మరోవైపు ఈ  భీకర యుద్ధంలో ఇరాన్ రక్షణ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసీర్‌జాదే (Aziz Nasirzadeh) మరణించారు. ఆయనతో పాటుగా పాటు ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది

Advertisment
తాజా కథనాలు