Donald Trump: రష్యా-ఉక్రెయిన్ వార్.. జీ-7 సదస్సులో ట్రంప్ సంచలన ప్రకటన!

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌-లే-బే నగరంలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న జీ-7 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ అన్నారు.

New Update
Donald Trump

Donald Trump

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌-లే-బే నగరంలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న జీ-7 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఇప్పుడు ముగిసిపోయిన చరిత్రన్నారు. ఇకపై తన పూర్తి శ్రద్ధను, వ్యూహాలను ఐదేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని శాంతియుతంగా ముగించడంపైనే కేంద్రీకరించనున్నట్లు తెలిపారు.  ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడానికి, రష్యాను చర్చల వైపు తీసుకురావడానికి అమెరికా తరఫున తాను చేయగలిగినదంతా చేస్తానని ట్రంప్ ప్రపంచ దేశాల నేతలకు హామీ ఇచ్చారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING : అక్రమాస్తుల కేసు : డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్!

ఇది కూడా చూడండి: Lashkar Bonalu Jatara 2026 : లష్కర్ బోనాల జాతర 2026...ఉత్సవాల షెడ్యూల్ విడుదల!

ఇందులో భాగంగానే రష్యాను మరింత ఆర్థికంగా దెబ్బతీసేందుకు, ఆ దేశ చమురు ఎగుమతులపై త్వరలోనే మళ్లీ కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలు విధించబోతున్నట్లు తెలిపారు. ఇరాన్ ఒప్పందం తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ చమురు రవాణా సాధారణ స్థితికి వస్తుందని, అందువల్ల రష్యా ముడిచమురుపై ఆంక్షలు విధించినా అంతర్జాతీయ మార్కెట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ట్రంప్ అన్నారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ జీ-7 ప్రత్యేక సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు. రష్యా సైనిక ఉత్పత్తిని, బ్యాంకింగ్ రంగాన్ని కట్టడి చేయడానికి మరిన్ని కఠినమైన ఆంక్షలు అవసరమని జెలెన్‌స్కీ ఇతర ప్రపంచ దేశాల నేతలను కోరారు.

ఇది కూడా చూడండి: Crime News : ముస్సోరీ హనీమూన్‌లో విషాదం... ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

ఇదే సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంతో ఆత్మీయంగా పలకరించి, షేక్ హ్యాండ్ చేస్తూ ఆయన భుజం తట్టారు. గత 16 నెలల కాలంలో వీరిద్దరూ ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య నమ్మకం, సమానత్వం ప్రాతిపదికన అంతర్జాతీయ భాగస్వామ్యాలు సాగాలని ఆకాంక్షించారు. ఆధునిక సాంకేతికతను, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను ప్రపంచ మానవాళి క్షేమం కోసమే ఉపయోగించాలని, వాటిని ఆయుధాలుగా మార్చకూడదని మోదీ పిలుపునిచ్చారు.

ఇది కూడా చూడండి: Today Horoscope: ఈ రాశి వారికి బిగ్ అలర్ట్.. చిన్న మిస్టేక్‌తో అనుకోని సమస్యలు.. పరిష్కారం కోసం ఏం చేయాలంటే?

Advertisment
తాజా కథనాలు