ఇండియా- కెనడా మధ్య ముదురుతున్న దౌత్య యుద్ధం..

ఓవైపు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు భారత్ కెనడా మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. ఇరు దేశాల మధ్య వీసా జారి ప్రక్రియ కూడా ఆపేయడంతో ఒక దేశం నుంచి మరొక దేశానికి కొత్తగా ఎవరు వెళ్లడానికి అవకాశం లేదు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update

అటు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతూ ఉంటే.. ఇటు భారత్ కెనడా మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు దేశాల మధ్య వీసా జారి ప్రక్రియ కూడా ఆపేయడంతో ఒక దేశం నుంచి మరొక దేశానికి కొత్తగా ఎవరు వెళ్లడానికి అవకాశం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? 

కెనడాలో కెనడా ప్రజల ప్రాణాలకు ఇండియన్ ఏజెంట్లా  వల్ల భద్రత లేకుండా పోయిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రోడో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇండియాను ఒక టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు. దీనికి హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ అనే ఖలిస్థాని నాయకుడి హత్యను సాకుగా చూపుతున్నారు. ఈ హత్యలో భారత గూఢచారులు డైరెక్ట్ గా పాల్గొన్నట్లు కెనడా పోలీసుల వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ త్రుడో వాదించారు. భారత రాయబారి సంజీవ్ కుమార్ వర్మతో పాటు కొందరు ఇతర దౌత్యాధికారుల ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు చేశారు. కొందరు దౌత్యధికారులను విచారిస్థామని కెనడా చేసిన ప్రతిపాదన పట్ల భారత్ ఆగ్రహం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి

ఇండియాను వదిలి వెళ్లిపోండి

స్వయంగా కెనడా ప్రధాని భారత రాయబారులను దోషులుగా, హంతకులుగా చూపిస్తే వారికి భద్రత ఎలా ఉంటుందని ఇండియా ప్రశ్నిస్తోంది. భారత రాయబారులను కెనడా భద్రత కల్పిస్తుందని నమ్మకం లేదని చెప్పింది. అందుకే దీంతో భారత రాయబారి సంజీవ్ కుమార్ పాటు ఆరుగురు దౌత్యధికారులను ఆ దేశం నుంచి ఇండియా తిరిగి రావాలని సూచించింది. కెనడా  రాయబారి విదేశీ మంత్రిత్వ శాఖకు పిలిపించి ఆ దేశం చేస్తున్న నిరాధార ఆరోపణలు  నిరసన తెలియజేసింది. అలాగే కెనడా రాయబారితో పాటు ఆరుగురు దౌత్యధికారులను దేశం నుంచి బహిష్కరించింది. ఈనెల 19వ తేదీ రాత్రి 10:00 లోపు భారత భూభాగాన్ని వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇంతకీ ఈ భారత్ కెనడా మధ్య దౌత్య యుద్ధానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు

నిజ్జర్ ఎవరూ ?

హరిదీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తాని ఏర్పాటు వాద నాయకుడు. 2023 జూన్ 18న వాన్కోవర్ సర్రే లోని గురుద్వారా సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇతన్ని కాల్చి చంపారు. రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి కారకుడైన ఈ నిజ్జర్ ఎవరో చూద్దాం. పంజాబ్ జలంధర్ జిల్లాలో ఉన్న హర్షిత్ పూర్ ఈయన స్వస్థలం. 1977 లో జన్మించిన ఈయన 1997లో కెనడాకు వలస వెళ్లి ముందు అక్కడ ప్లంబర్ గా  పనిచేశాడు. తర్వాత సిక్కు గురుద్వారకు వెళ్లి అక్కడి నుంచి కలిస్తాన్ ఏర్పాటు వాద కార్యకలాపాలను తీవ్రం చేశాడు. భారత్ లో  సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించటం, ఉగ్రవాదులకు డబ్బు ఆయుధ సరఫరా చేయడం మొదలుపెట్టాడు. ఇండియాలోని నిషేధిత మిలిటెంట్ గ్రూప్ అయిన ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ కు అతడే నాయకత్వం  వహిస్తున్నాడు.

Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!

భారత్‌పై ఆరోపణలు 

ఇతని హత్య వెనక భారత రహస్య ఏజెంట్లు ఉన్నారని వారికి భారత రాయబార కార్యాలయం సపోర్టు చేసిందని కెనడా గత ఏడాది  ఆరోపించింది. తమ ఏజెంట్లు హస్తం ఉందని చెప్పడానికి ఆధారాలు వుంటే చూపించాలని పదేపదే చెప్పినా ఇవ్వలేక పోయారు. స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో పార్లమెంటులో చేసిన ఈ నిరాధార ఆరోపణ పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడే మన దేశంలో దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని సూచించింది. బెంగుళూరు, ముంబై , చండీగఢ్లో ఉన్న కెనడా కాన్సిలేటలో సర్వీసులు నిలిపివేసింది. భారత్ నుంచి 41 మంది దౌత్య సిబ్బందిని పాటు వారి కుటుంబ సభ్యుల్ని వెనక్కు పంపించేసింది. ఇమిగ్రేషన్ సిబ్బందిని కూడా 27 నుంచి ఐదుకు తగ్గించింది.

నిజ్జర్ హత్యను సాకుగా చూపి భారత పట్ల కెనడా ప్రభుత్వం తీవ్ర వ్యతిరేక ధోరణిని అవలంభించడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం ప్రధానిగా ఉన్న ట్రూటో పాపులారిటీ రోజురోజుకీ పడిపోతుంది. ఆయన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. వచ్చే సంవత్సరం కెనడా ఫెడరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో సిక్కుల మద్దతు కోసం ఆయన ఈ భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. కెనడాలో ఉన్న 3.8 కోట్ల జనాభాలో 20 లక్షల మంది భారతీయులు. ఇందులో సగం మంది సిక్కులు ఉన్నారు. వీరు ప్రధానంగా ఒంటరియో, బ్రిటిష్ కొలంబియా, అల్బెర్టా  ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే కెనడా పార్లమెంట్లో 16 మంది సిక్కు ఎంపీలు ఉండగా ట్రూడొ మంత్రివర్గంలో నలుగురు మంత్రులు ఉన్నారు. 

Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

కెనడా రక్షణ మంత్రి హర్షిత్ సర్జన్ కూడా సిక్కు నాయకుడే. కెనడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థితిలో సిక్కులు ఉండటం వల్ల వీరి మద్దతు కోసమే కెనడా భారత వ్యతిరేక వైఖరి తీసుకుంది. మరోవైపు కెనడాలో జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి,  హెల్త్ కేర్ సిస్టం బాగా దెబ్బతింది, క్రైమ్ రేట్స్ భారీగా పెరుగుతోంది. మరోవైపు తన ప్రత్యర్థి... కన్సర్వేటివ్ పార్టీ నాయకుడి కన్నా జస్టిన్ ట్రోదో  19 పాయింట్స్ వెనుకబడి ఉన్నారు. దీంతో తన రాజకీయ మనుగడ కోసం ఖాలిస్తాని నాయకులకు మద్దతు ఇస్తూ భారత్ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. 

కెనడాలోని ఖలిస్థాని మద్దతుదారులను టార్గెట్ చేయడానికి భారత ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసి పనిచేస్తుంది అని కెనడా ప్రభుత్వం ఆరోపణ చేసింది. ఇటీవల ముంబైలో హత్యకు గురైన NCP నేత బాబా సిద్ధికి హత్యలో లారెన్స్ బష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆధారాలు దొరికిన సమయంలోనే కెనడా ప్రధాని చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆ గ్యాంగ్ సభ్యులతో భారతీయ ఏజెంట్లు కుమ్మక్కయ్యారని కెనడాలోని ఖలిస్తానీ మద్దతుదారులను వీరు లక్ష్యంగా చేసుకున్నారని నిరాధారమైన ఆరోపణలు చేసింది కెనడా ప్రభుత్వం. మొత్తానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన రాజకీయ లబ్ధి కోసం పెట్టిన చిచ్చు  ప్రజలకు కూడా తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ ఫలితం వచ్చే ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో అనుభవిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు