Trump : ఇరాన్‌కు ఇదే చివరి రాత్రి.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్

హార్మూజ్ జలసంధి తెరవకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. హర్మూజ్ జల సంధి తెరవకపోతే ఇరాన్‌కు ఇదే చివరిరాత్రి అని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇరాన్‌‌‌ను ప్రపంచ పటంలో నుంచి తుడిచిపెడుతాం అంటూ తెగేసి చెప్పాడు.

New Update
Trump

Trump

Trump : ఇరాన్‌, అమెరికా యుద్ధం చివరిదశకు చేరుకుందా? అంటే అవుననే అనిపిస్తోంది. హార్మూజ్ జలసంధి తెరవకపోవడం, కాల్పుల విరమణకు ఇరాన్‌ అంగీకరించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. హర్మూజ్ జల సంధి తెరవకపోతే ఇరాన్‌కు ఇదే చివరిరాత్రి అని వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ రాత్రే ఇరాన్‌ చరిత్రలో చివరి రాత్రిగా మారుస్తాం. ఇరాన్‌‌‌ను ప్రపంచ పటంలో నుంచి తుడిచిపెడుతాం.ఇరాన్ 47 ఏళ్ల నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతాం అంటూ ట్రంప్‌ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. ఇరాన్ దేశాన్ని మళ్లీ పున:నిర్మించలేరు. అలా జరగాలని నేను కోరుకోవటం లేదు. అయినా అదే జరుగుతుంది అంటూ ట్రూత్ పోస్టులో  స్పష్టంగా చెప్పారు ట్రంప్. 

హర్మూజ్ ఓపెన్ కాకపోతే.. ఈ రాత్రికి ఇరాన్ దేశంలో నాగరికత అంతం అవుతుంది అంటూ ఫైనల్ గా స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. చరిత్రలో అత్యంత కీలకమైన క్షణాలలో ఒకటిగా ఇది నిలుస్తుంది అంటూ పేర్కొన్నాడు ట్రంప్. కాగా ట్రంప్‌ ఇచ్చిన డెడ్‌ లైన్‌ రేపటితో ముగియనుంది.ఇప్పటికే ఖార్గ్ ఐలాండ్‌పై అమెరికా భీకర దాడులకు దిగింది. ఇరాన్ ప్రజలను దేవుడు ఆశీర్వదించుగాక అంటూ ట్రంప్ పోస్ట్ చేయడం గమనార్హం. ఇప్పనటికే అమెరికా-ఇజ్రాయెల్ సైన్యం రాన్ చుట్టూ మోహరించింది. ఇంకా ట్రంప్‌ తన పోస్టులో "ఇరాన్ పాలనలో ఇప్పుడు మార్పు వచ్చింది. భిన్నమైన, తెలివైన, తీవ్రవాద భావజాలం తక్కువగా ఉన్న మనుషులు విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైనది ఏమైనా జరగొచ్చు.. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ట్రంప్‌ కామెంట్ చేశారు.
 
కాగా, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్‌, అమెరికా పట్టింపులకు దిగాయి. హార్మూజ్‌ జలసంధిని తన ఆధీనంలో ఉంచుకున్న ఇరాన్‌ ఇతర దేశాలకు చెందిన చమురు నౌకలను అ ప్రాంతం గుండా వెళ్లకుండా నిరోదిస్తుంది. దీంతో పలు దేశాల్లో గ్యాస్‌, పెట్రోల్‌ దొరకకపోవడంతో ఆయా దేశాలు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. కాగా, హర్మూజ్‌ను  ఓపెన్ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‎కు రేపటివరకు గడువు ఇచ్చాడు. ఇక ఇచ్చిన గడువు ముగిసేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. డెడ్ లైన్ టైమ్ ముగుస్తున్నప్పటికీ ఇరాన్‎ అసలు దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్ర ఆగ్రహం, నిరాశ, నిస్పృహలో ఉన్న ట్రంప్ మరోసారి ఇరాన్‎కు డెడ్లీ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు