/rtv/media/media_files/2026/03/14/dubai-2026-03-14-16-03-38.jpg)
DUBAI SITUATION
DUBAI SITUATION : ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా దుబాయ్‌లో అల్లకల్లోలం ఏర్పడింది. ఎప్పుడు పర్యాటలకుతో సండిగా ఉండే దుబాయ్ ఇరాన్ దాడులతో బోసిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం దుబాయ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దుబాయ్ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలంగా మారాయి.దుబాయ్‌లోని మేజర్ ఫైనాన్స్ సెక్టార్స్‌పై ఇరాన్ దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయాయి. బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్‌తో పాటు ప్రముఖ హోటళ్లపై దాడి చేయడంతో పర్యాటకులు సందడి కనుమరుగైంది. దుబాయ్ హార్ట్ ఆఫ్ ఆయిల్ బ్లాక్ అరామ్‌కో కంపెనీపై ఎటాక్ చేయడంతో తీవ్రంగా నష్టం జరిగింది.
షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలు పూర్తిగా క్లోజ్‌అయ్యాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం వణుకుతున్నారు. భారీగా డిస్కౌంట్ ఇచ్చినా హోటళ్లకు గిరాకీ లేని పరిస్థితి నెలకొంది. దుబాయ్‌లో అంతర్జాతీయ బ్యాంకులు తమ ఆఫీస్‌లను క్లోజ్ చేశాయి. దుబాయ్ నుంచి పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.దుబాయ్ నుంచి రావాలంటే స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ మాత్రమే దిక్కాయ్యాయి. అయితే ఆ స్పెషల్ ఫ్లైట్స్‌లో ఒక్కో టికెట్ ధర లక్షల్లో వసూలు చేస్తున్నారు. అయినా భారతీయ సంపన్నులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి వచ్చేస్తున్నారు.
అయితేదుబాయ్ మరియు ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) లో ఇరాన్ దాడుల ప్రభావం వల్ల ప్రస్తుత పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, స్థానిక అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివర నుండి ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షేపణులలో మెజారిటీ (సుమారు 90% పైగా) UAE రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అలా అడ్డుకున్న క్షేపణుల శకలాలు (Debris) దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్, పామ్ జుమేరా, అబుదాబీలోని కొన్ని నివాస ప్రాంతాలపై పడటం వల్ల స్వల్ప నష్టం జరిగింది. క్షేపణి శకలాలను తాకవద్దని, వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు కొందరిని అరెస్ట్ కూడా చేశారు.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ, పరిమిత సంఖ్యలో నడుస్తున్నాయి. అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ షెడ్యూల్‌లను మార్చుకున్నాయి. కొన్ని రద్దు చేసుకున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సుమారు 80 విమానాలను నడుపుతూ భారతీయులను స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇండిగో (IndiGo) సుమారు 97 విమానాలను రద్దు చేసింది. భారత్ నుంచి వెళ్లిన వారు ఇక్కడ చిక్కుకుపోతే, భారత ప్రభుత్వం వారి వీసాలను 30 రోజుల పాటు పొడిగించి, పెనాల్టీలను మినహాయించింది.
దుబాయ్ ఆర్థిక జిల్లా (DIFC) లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు (ఉదాహరణకు స్టాండర్డ్ చార్టర్డ్) తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యాన్ని కల్పించాయి. అయితే అన్ని కార్యాలయాలు పూర్తిగా మూతపడలేదు. భద్రతా కారణాల దృష్ట్యా గ్లోబల్ విలేజ్ (Global Village) లో బాణసంచా ప్రదర్శనలను రద్దు చేశారు. ఐన్ దుబాయ్ (Ain Dubai) వంటి పర్యాటక ప్రాంతాలు తాత్కాలికంగా మూసివేశారు. దుబాయ్‌లో నివసిస్తున్న సుమారు 35 లక్షల మంది భారతీయుల భద్రతను భారత రాయబార కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తోంది. మార్చి మొదటి వారంలోనే సుమారు 52,000 మంది భారతీయులు ప్రత్యేక విమానాల ద్వారా సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.
Follow Us