Sindhuja : అమెరికా గడ్డపై తెలుగు తేజం...హారిస్‌ స్కూల్‌ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా తీపిరెడ్డి సింధూజ

అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో తెలుగు అమ్మాయి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆ యూనివర్సిటీ పరిధిలోని హారిస్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా హైదరాబాద్‌కు చెందిన తీపిరెడ్డి సింధూజ ఎన్నికయ్యారు.

New Update
FotoJet - 2026-04-28T065455.344

Teepireddy Sindhuja

Sindhuja : అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో తెలుగు అమ్మాయి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆ యూనివర్సిటీ పరిధిలోని హారిస్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా హైదరాబాద్‌కు చెందిన తీపిరెడ్డి సింధూజ ఎన్నికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో పోటీపడి, మెజారిటీ ఓట్లతో ఆమె ఈ బాధ్యతను కైవసం చేసుకోవడం విశేషం.

హోరాహోరీ పోరులో ఘన విజయం

ఈ ఎన్నికల్లో సింధూజకు గట్టి పోటీ ఎదురైంది. బరిలో ఇద్దరు అమెరికన్ విద్యార్థులు, ఒక పాకిస్థాన్ విద్యార్థి,  ఇథియోపియాకు చెందిన మరో విద్యార్థిని ఉన్నారు. దాదాపు 500 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పటికే స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్న సింధూజ, తనకున్న అనుభవంతో ప్రచారంలో దూసుకుపోయారు. సోషల్ మీడియా వేదికగా, నేరుగా విద్యార్థులతో కలిసి తన కార్యాచరణను వివరించడం ఆమె విజయానికి బాటలు వేసింది. తీపిరెడ్డి సింధూజ సాధించిన విజయం కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనం.  

సింధూజది హైదరాబాద్‌లోని హబ్సిగూడ. ఆమె తల్లిదండ్రులు ప్రమీల, ప్రద్యుమ్నారెడ్డి ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో, చిన్నతనం నుంచే ఆమె విద్యపై మక్కువ పెంచుకున్నారు. రామాంతపూర్ పబ్లిక్ స్కూల్ (10వ తరగతి వరకు).ఇంటర్మీడియట్: భద్రుకా కాలేజీ (MEC).డిగ్రీ: సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ (BA ఎకనామిక్స్). డిప్లొమా: నల్సార్ (NALSAR) యూనివర్సిటీ నుంచి 'ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా'లో డిప్లొమా పూర్తి చేశారు.

 సింధూజ కేవలం చదువులోనే కాదు, ఇతర రంగాల్లోనూ తన ముద్ర వేశారు. ఆమె సుశిక్షితురాలైన కూచిపూడి డ్యాన్సర్ ,చురుకైన అథ్లెట్.ఎన్‌సీసీ క్యాడెట్‌గా 2020లో ఢిల్లీలో జరిగిన పీఎం (PM) ర్యాలీలో పాల్గొని సత్తా చాటారు.: హార్వర్డ్-ఇండియా కాన్ఫరెన్స్ నిర్వహించిన 'పాలసీ హ్యాకథాన్‌'లో సింధూజ బృందం ప్రథమ బహుమతి సాధించింది. జమ్మూ-కశ్మీర్‌లోని మహిళలకు సూక్ష్మ రుణాలు (Micro-finance) అందించే అంశంపై వారు రూపొందించిన ప్రాజెక్టుకు ఈ గౌరవం దక్కింది. భారత ప్రభుత్వ థింక్ ట్యాంక్ 'నీతి ఆయోగ్'లో ఇంటర్న్‌షిప్ చేసిన అనుభవం ఆమెకు ఉంది.
 
సింధూజ అంతిమ లక్ష్యం సివిల్ సర్వెంట్ కావడం. కేవలం పరిపాలన మాత్రమే కాకుండా, ప్రజల జీవితాలను మార్చే విధానాల రూపకల్పనలో (Policy Making) క్రియాశీలక పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. "అంతర్జాతీయ స్థాయిలో చదవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ పరిపాలన పద్ధతులను నేర్చుకోవచ్చు. మాస్టర్స్ పూర్తయ్యాక కొంతకాలం ప్రపంచ బ్యాంకులో పనిచేసి, ఆ అనుభవంతో భారతదేశానికి తిరిగి వచ్చి సివిల్స్ రాస్తాను." - సింధూజ అంటున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేస్తున్న సింధూజ, భారతీయ విద్యార్థులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు