Iran sleeper cells : సుప్రీం లీడర్ హత్య...ఆత్మహుతి దాడులకు సిద్ధమైన ఇరాన్‌

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర అగ్రహాంతో ఊగిపోతున్నది. తమ శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకునేందుకు ఆత్మహుతి దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసింది.

New Update
israel

Iran strikes on Israel

Iran sleeper cells : ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర అగ్రహాంతో ఊగిపోతున్నది. తమ శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకునేందుకు ఎంతకైన తెగించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఖమేనీని ప్రత్యక్ష దైవంగా భావించే ఆయన అభిమానులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అవకాశం దొరికితే ఎంతటి త్యాగానికైన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహుతి దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.
 
గత నెల (ఫిబ్రవరి 28) 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై బాంబు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ కు చెందిన అగ్రనాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. టెహ్రాన్‌లోని మొత్తం 30 చోట్ల అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ దుర్మారణం పాలయ్యాడు. ఆయనతో పాటు ఆయన భార్య, కోడలు, మనవడు కూడా చనిపోయారు. ఆయన ఒక్కడే కాదు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అనేక మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.
 
తమ ఆరాధ్య నేతగా భావించే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. ఇజ్రాయెల్‌ తో పాటు అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడింది. అయినా తమ లక్ష్యం నెరవేరలేదన్న నిరాశతో ఉన్న ఇరాన్‌ అమెరికా, ఇజ్రాయెల్‌పై పతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆత్మహుతి దాడులకు సిద్దపడింది. ఈ మేరకు స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు ఓ అమెరికా మీడియా కథనం ప్రచురించింది. ఖమేనీ మృతి తర్వాత పగతో రగిలిపోతున్న ఇరాన్  తన స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసింది. విదేశాల్లో ఉన్న ఇరాన్ స్లీపర్ సెల్స్ దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్‌ను అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గుర్తించాయని వెల్లడించింది. నిఘా వర్గాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని కథనం వివరించింది.

కాగా నిఘావర్గాల కథనం ప్రకారం ప్రిలిమినరీ సిగ్నల్స్ అనాలసిస్‌లో ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్‌ ఇరాన్‌ నుంచే వచ్చినట్లు తేలింది. సాధారణానికి భిన్నంగా, ఈ సిగ్నల్స్ పలు దేశాల ద్వారా రీ-బ్రాడ్‌ కాస్ట్‌ అయ్యాయి. అయితే ఇది
రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లను నిరంతరం పర్యవేక్షించే విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఎన్‌క్రిప్టెడ్ భాషలో ఉన్న ఆ మెసేజ్‌‌లను చదవటం అంత ఈజీ కాదు. డిక్రిప్షన్ కీ ఉన్న వారు మాత్రమే వాటిని చదివే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా, డిజిటల్ ఆధారాలు దొరకకుండా సిగ్నల్స్ పంపడానికి ఇటువంటి కమ్యూనికేషన్ పద్ధతులను సాధారణంగా నిఘా సంస్థలు లేదా ఉగ్రవాద ముఠాలు ఉపయోగిస్తుంటాయపి నిఘావర్గాలు స్పష్టం చేశాయి.

Advertisment
తాజా కథనాలు