పడింది దెబ్బ..అదానీ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం పున:పరిశీలన అనుకున్నట్టే అయింది...శ్రీలంకలో అదానీ ప్రాజెక్టు గందరగోళంలో పడింది. అదానీ విద్యుత్ ప్రాజెక్టు గురించి మరో సారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది. By Manogna alamuru 14 Oct 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Adani Project In Sri lanka: ఈ మధ్యనే పొరుగు దేశం శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్ని అనిశ్చితులు, అంతర్గత కోట్లాటలు, గొడవలు తర్వాత శ్రీలంక ఇప్పుడే కుదురుకుంటోంది. కొన్నాళ్ళు పాటూ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న దేశంలో...ఎన్నికలు జరిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దినాయకే బాధ్యతలు చేపట్టారు. ఈయన రావడంతోనే శ్రీలంకలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పక్క దేశాల సహకారంతో తమ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం శ్రీలంకను అన్ని విధాలా బాగు చేసి ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని అనుర కుమార అన్నారు. Also Read: TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే! ఎప్పటి నుంచో వ్యతిరేకం.. అయితే అనుర కుమార కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని తెలిసి దగ్గర నుంచి ఆ దేశంలో ఉన్న అదానీ విద్యుత్ ప్రాజెక్టు కొనసాగింపు మీద అనుమానాలు నెలకొన్నాయి. శ్రీలంకలో ఆదానీ కంపెనీ విండ్ అండ్ పర్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. జేవీపీ పార్టీ మొదటి నుంచి దీనికి వ్యతిరేకంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే శ్రీలంకలో ఉన్న అదానీ విండ్ అండ్ పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తామని అనుర కుమార ముందు నుంచే చెబుతూ వస్తున్నారు. శ్రీలంకకు ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించనున్న ఈ ప్రాజెక్టుకి తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. దాంతో పాటూ జేవీపీ పార్టీ కొంత ఇండియాకు వ్యతిరేకంగానే ఉంది. శ్రీలంకలో ఉంటున్న తమిళుల పట్ల ఈ పార్టీ స్టాండ్ మొదట నుంచి వేరుగానే ఉంది. ప్రస్తుతం శ్రీలంకకు ఇండియా, చైనా భారీగా రుణాలిస్తున్నాయి. ఇందులో చైనా వామపక్ష భావజాలం ఉన్న దేశం. అనుర కుమార పార్టీ అయిన జేవీపీ కూడా వామపక్ష భావజాలం ఉన్నదే. అందుకే ఈ పార్టీ, కొత్త అధ్యక్షుడు భారత్ కన్నా చైనాకే ఎక్కువ అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే అదానీ పార్టీని వ్యతిరేకించడం అనే టాక్ ఉంది. దాంతో పాటూ ప్రావిన్సులకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పే ఇండియా - శ్రీలంక ఒప్పందాన్ని జేవీపీ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది. Also Read: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త అనుకున్నట్టే జరిగింది.. ఇప్పుడు తాజాగా శ్రీలంకలో అదానీ ప్రాజెక్టును అనుర కుమార ప్రభుత్వం రెడ్ సిగ్నల్ వేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదాన్ని కొత్త ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందని శ్రీలంక అటార్నీ జనరల్ కార్యాలయం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయం మీద అక్కడి ఓ జాతీయ వార్తా పత్రిక వివరాలు ప్రచురించింది. అక్టోబర్ 7న కొత్త మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పునరాలోచనపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం ప్రాజెక్ట్ దాని ధర నిర్మాణానికి సంబంధించి సమస్యలు అని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ చెప్పారు. అదానీ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం ఆమోదించిన విద్యుత్ ఛార్జీల విషయంలో కొంత సమస్య ఉందన్నారు. ఈ ఛార్జీలు చాలా ఎక్కువని ఆమె అన్నారు. నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం తాజాగా పరిశీలన జరుపుతుందని విజిత చెప్పారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం అక్కడి అదానీ ప్రాజెక్టుల మీద దెబేసింది. ఇప్పుడు శ్రీలంక కూడా అదే బాటలో నడుస్తోంది. దీంతో ప్రపంచంలో తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్న అదానీ కల కుంటుపడినట్టయింది. Also Read: Also Read: Arjun-Pawan Kalyan:అల్లు అర్జున్ పేరెత్తిన పవన్.. ఏమన్నాడో తెలుసా? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి