USA: అతి పెద్ద రాకెట్..స్టార్ షిప్ ప్రయోగం విజయవంతం ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ షిప్ ఐదో ప్రయోగం విజయవంతం అయింది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రాకెట్. రెండు దశల ఈ భారీ రాకెట్ వియవంతంగా భూమికి చేరుకుంది. By Manogna alamuru 13 Oct 2024 | నవీకరించబడింది పై 13 Oct 2024 21:40 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Starship Rocket: 71 మీటర్ల పొడవైన భారీ బూస్టర్ రాకెట్‌ను స్పేస్ ఎక్స్ ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం టెక్సాస్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి ఎగిసింది. ఈ భారీ బూస్టర్ రాకెట్‌లో రెండు దశలుగా ఉంది. ఒకటి బూస్టర్, రెండు స్పేస్ క్రాఫ్ట్. ఇందులో బూస్టర్ మొదట విజయవంతంగా భూమికి చేరుకుంది. ఎక్కడ నుంచి ఆకాశంలోకి వెళ్ళిందో తిరిగి అదే ల్యాంచ్ ప్యాడ్‌కు బూస్టర్ చేరుకుంది. బూస్టర్ ల్యాంచ్ ప్యాడ్ కు చేరుకున్నప్పుడు దాన్ని చాప్‌స్టిక్‌లు ఒడిసిపట్టాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. తరువాత స్పేస్ క్రాఫ్ట్ కూడా తన ప్రయాణాన్ని కొనసాగించి...హిందూ మహాసముద్రంలో సేఫ్‌గా ల్యాండ్ అయింది. The tower has caught the rocket!!pic.twitter.com/CPXsHJBdUh — Elon Musk (@elonmusk) October 13, 2024 ఈ భారీ స్పేస్ క్రాఫ్ట్ ఒక ఇంజనీర్ అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి వీడియోలు ఎలాన్ మస్క్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రయోగం ద్వారా రెండు లక్ష్యాలు నెరవేరాయని చెప్పారు. మరోవైపు స్పేస్ ఎక్స్ ప్రయోగం విజయవంతంతో నాసా సెంటర్లో, స్పే ఎక్స్ కంట్రోల్ రూమ్‌లో సందడి నెలకొంది. స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఈ ఐదవ స్టార్‌షిప్ రాకెట్ పొడవు 121 మీటర్లు అంటే..400 అడుగులు. రెండు దశల (బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్)తో ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా పేరుపొందింది. చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా స్పేస్‌ఎక్స్ దీన్ని రూపొందించింది. ఫ్లోరిడా లేదా కాలిఫోర్నియా నుంచి భూకక్ష్యలోకి ఉపగ్రహాలను చేరవేసే, ఐఎస్‌ఎస్‌కు సిబ్బందిని తరలించే ‘ఫాల్కన్-9’ రాకెట్ల మొదటి దశ బూస్టర్‌లు కూడా భూమిపైకి చేరుకుంటాయి. కానీ, అవి సముద్రంలో తేలియాడే ప్లాట్‌ఫాంలపై, లాంచ్ ప్యాడ్‌లకు దూరంగా ఉన్న కాంక్రీట్ స్లాబ్‌లపై దిగుతాయి. లాంచ్‌ప్యాడ్‌కే చేరుకోవడం ఇదే మొదటిసారి. pic.twitter.com/ZOvkj5idCY — Elon Musk (@elonmusk) October 13, 2024 Also Read:సల్మాన్‌కు సహకరిస్తే చావే..లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి