రష్యా సంచలన నిర్ణయం.. ఉగ్రజాబితా నుంచి తాలిబన్లు తొలగింపు

2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్‌ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది.

New Update
talibans 2

2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత.. ఆ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్‌ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంపై తాలిబన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2003లోనే రష్యా తాలిబన్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. 2021లో అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్ల చేతిలోకి వెళ్లిపోయాక.. కేవలం చైనా, యూఏఈ దేశాలు మాత్రమే తాలిబన్‌ల రాయబారులను అంగీకరించాయి. ఇంకా ఏ దేశాలు కూడా వారి పాలనను గుర్తించలేదు. 

Also Read: పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్‌పై మరో అటాక్ చేయనున్న ఇరాన్‌..

ఇటీవల రష్యా.. తాలిబాన్లతో సంబంధాలు కొససాగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది జులైలో ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ ఉద్యమాన్ని ఉగ్రవాదంపై పోరులో భాగంగానే చూస్తామని వెల్లడించారు. ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వంతో తాము ఆచరణాత్మక సంప్రదింపులు జరిపే అవసరం ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఆ దేశంతో రాజకీయ, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే తాజా నిర్ణయం వాస్తవరూపం దాల్చేందుకు చట్టపరమైన పలు రూల్స్ పాటించాల్సి ఉందని అఫ్గాన్ వ్యవహారాలు చూసే రష్యా ప్రతినిధి తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment