POK: కీలుబొమ్మ ప్రభుత్వం.. కానరాని స్వేచ్ఛ.. POKలో తిరుగుబాటకు షాకింగ్ కారణాలివే!

ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా పాకిస్థాన్ పాలనలో ఉన్న ఈ ప్రాంత ప్రజలు, తమకు కనీస సౌకర్యాలు లేవంటూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.

New Update
FotoJet (5)

Protests in PoK

ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా పాకిస్థాన్ పాలనలో ఉన్న ఈ ప్రాంత ప్రజలు, తమకు కనీస సౌకర్యాలు లేవంటూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, నిరుద్యోగ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పాలకులు తమను పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. PoKలో ప్రస్తుతం ఆర్థిక స్థితిగతులు చాలా దారుణంగా మారాయి. సరైన పరిశ్రమలు లేకపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఆదాయ మార్గాలు లేక, ధరల మోతతో ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.

ఆధీనంలోకి తీసుకున్న పాక్..

PoK ప్రధానంగా 'ఆజాద్ జమ్మూ కాశ్మీర్' 'గిల్గిత్-బాల్టిస్తాన్' అనే రెండు భాగాలుగా విభజించారు. వీటి మొత్తం వైశాల్యం 90,972 చదరపు కిలోమీటర్లు. ఆజాద్ జమ్మూ కశ్మీర్‌కు పేరుకు మాత్రమే సొంత రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు ఉన్నప్పటికీ, అధికారమంతా పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగుతుంది. ఎన్నికలన్నీ వారి అధికారంలోనే జరుగుతాయి. అయితే 1949 నాటి 'కరాచీ ఒప్పందం' పేరుతో గిల్గిత్-బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ తన ఆధీనంలోకి తీసుకుంది.

అసెంబ్లీలోని 45 స్థానాల్లో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JAAC) డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి ఈ సీట్ల కోసం అర్హులైన వారు కశ్మీర్‌లో లేరు. కేవలం పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌ల నుంచి వచ్చే రాజకీయ నాయకులకు, అధికార పార్టీలకు ఈ సీట్లు కట్టబెట్టి స్థానిక ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కోర్టులు అనర్హులుగా ప్రకటించిన వారు కూడా ఈ సీట్ల ద్వారా పదవులు అనుభవిస్తున్నారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ప్రజలు చేస్తున్న శాంతియుత పోరాటంపై పాక్ సైన్యం కాల్పులు జరపింది. ఈ దాడుల్లో 32 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం ఈ నిరసనకారులను 'మిలిటెంట్లు' అని ముద్రవేసి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

పాకిస్తాన్ ప్రభుత్వం PoK బడ్జెట్‌ను 75 బిలియన్ల నుంచి 63 బిలియన్ల రూపాయలకు తగ్గించింది. ఒకవైపు పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంటే.. మరోవైపు PoKలో నిరుద్యోగిత రేటు 2024-25 నాటికి 11 శాతానికి పెరిగింది. అక్షరాస్యత రేటు 77.5% ఉన్నప్పటికీ ఉపాధి లేక యువత రోడ్డు మీద పడుతోంది. అలాగే తలసరి ఆదాయం కూడా పడిపోయింది. ఓ వైపు భారత్ జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ.. బడ్జెట్‌ను ఏటా పెంచుకుంటూ వెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఆక్రమిత భూభాగాలను దోచుకుంటూ అక్కడి ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తోంది. 

Advertisment
తాజా కథనాలు