అరుదైన ఘనత.. చనిపోయిన మెదడును బతికించిన శాస్త్రవేత్తలు..!

చైనా పరిశోధకులు సరికొత్త ఘనతను సాధించారు. ఓ ప్రయోగంలో చనిపోయిన పంది మెదడును తొలగించి.. 50 నిమిషాల తర్వాత దానిని మళ్లీ పునఃప్రారంభించారు. పంది మెదడులోని నాడీ కార్యకలాపాలను శరీరం నుంచి తొలగించి ఆ తర్వాత పునరుద్దరించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టంను ఉపయోగించారు.

New Update
Pig brain brought back to life

ఆధునిక యుగంలో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంది. టెక్నాలజీ పరంగా రోజు రోజుకూ దూసుకుపోతుంది. ఎన్నో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ సక్సెస్ దిశగా పరుగులు పెడుతుంది. అయితే ఎంత టెక్నాలజీ మారినా.. మనిషికి చావులేకుండా చేయడం అనేది అసాధ్యం.

పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. మరి ఇలాంటి సమయంలో చనిపోయిన మెదడును కేవలం 50 నిమిషా తర్వాత బ్రతికించిన అరుదైన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అవును మీరు విన్నది నిజమే. అదేంటి చనిపోయిన మెదడును మళ్లీ తిరిగి బ్రతికించడం ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా?.. నిజంగానే సాధ్యం అయింది. 

ఇది కూడా చదవండి: ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన!

టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా.. ఇటీవల అరుదైన ప్రయోగం చేసి రికార్డు క్రియేట్ చేసింది. చనిపోయిన మెదడును 50 నిమిషాల తర్వాత బ్రతికించి.. చైనా పరిశోధకులు సరికొత్త ఘనతను సాధించారు. గుండెపోటు తర్వాత రోగులకు పునరుజ్జీవనం అందించటంలో సహాయపడే ప్రయోగంలో ఒక అడుగు ముందుకేశారు. 

ఏంటా ప్రయోగం..

ఇది కూడా చదవండి: చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు!

చైనాలోని సన్ యాట్ సేన్ యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవల పంది చనిపోయిన తర్వాత దాని మెదడును ఎలా పునరుద్ధరించాలనే దానిపై అధ్యయనం చేశారు. ఓ ప్రయోగంలో చనిపోయిన తర్వాత పంది మెదడును తొలగించారు. అలా దాదాపు 50 నిమిషాల తర్వాత దానిని పునఃప్రారంభించినట్లు చైనా సైంటిస్ట్‌లు తెలిపారు. ఈ పరిశోధన ద్వారా వారు కొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా గుండెపోటు వల్ల మెదడు దెబ్బతినడాన్ని సరిచేసే ప్రక్రియలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఎక్స్ వివో బ్రెయిన్ మెయింటినెన్స్ టెక్నాలజీ

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

ఇందులో పంది మెదడులోని నాడీ కార్యకలాపాలను బాడీ నుంచి రిమూవ్ చేసిన తర్వాత మళ్లీ దానిని పునరుద్దరించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టంను గ్యాంగ్ జౌ లోని సన్ యాట్ సేన్ యూనివర్శిటీ అనుబంధ హాస్పిటల్ పరిశోధకులు ఉపయోగించారు. ఈ ప్రయోగంలో జర్మన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సొసైటీ మాజీ ప్రెసిడెంట్ జోయెర్న్ నాషన్, క్లీవ్ ల్యాండ్ క్లీనిక్ లోని ఇమ్యునిటీ స్పెషలిస్ట్ ఆండియా వంటి అంతర్జాతీయ సహకారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ బృందం లివర్ అసిస్టెడ్ బ్రెయిన్ నార్మోథర్మిక్ మెషిన్ పెర్ఫ్యూజన్ (NMP) అనే ‘‘ఎక్స్ వివో బ్రెయిన్ మెయింటినెన్స్’’ టెక్నాలజీను డెవలప్ చేసింది.

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

మెదడును 50 నిమిషా తర్వాత బ్రతికించారు

ఈ టెక్నాలజీ అనేది కృత్రిమ గుండె, ఊపిరితిత్తులను కలిగి ఉండటమే కాకుండా.. పందికి సంబంధించిన కాలేయాన్ని సైతం రక్త ప్రసరణలో అనుసంధానిస్తుంది. ఈ తరుణంలో పందులకు మత్తుమందు ఇచ్చి వాటి మెదడులను వేరు చేయడానికి ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో మెదడు మాత్రమే NMPకి కనెక్ట్ చేయబడింది. దీంతో అప్పుడు మెదడు తరంగాలు బాడీ నుంచి తొలగించబడ్డాయి. ఆపై 50 నిమిషాల తర్వాత ఆ తరంగాలు తిరిగి మెదడుకు చేరుకున్నట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు