Russia: మరో యుద్ధానికి సిద్ధం... రష్యా గడ్డపై నార్త్ కొరియా బలగాలు! రష్యా యుద్ధానికి ఉత్తర కొరియా ఆజ్యం పోస్తోంది. ఉక్రెయిన్ మీద దండెత్తడానికి రష్యాకు సాయంగా ఉత్తర కొరియా తన బలగాలను పంపిస్తోంది. తాజాగా 1500మంది సైనికులు రష్యా వెళ్ళారని అమెరికాలోని పెంటగాన్ కార్యాలయం ఆరోపిస్తోంది. By Manogna alamuru 23 Oct 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి North Korea Troops: దాదాపు ఏడాదిన్నర అవుతోంది...కానీ రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడం లేదు. రష్యా ఎన్ని ఏళ్ళయినా తగ్గేదే లేదు అంటోంది. ఉక్రెయిన్ కూడా ధీటుగానే జవాబు ఇస్తోంది. అయితే ఉక్రెయిన్‌ను ఎలా అయినా ఓడించాలని పట్టుబట్టింది రష్యా. దీని కోసం అదనపు బలగాలను సమకూర్చుకుంటోంది. తాజాగా ఉత్తర కొరియా నుంచి 1500 మంది సైన్యం రష్యా చేరుకున్నారు. ఉత్తర కొరియా ఇంతకు ముందు కూడా తన సైన్యాన్ని రష్యాకు పంపిందని చెబుతోంది దక్షిణ కొరియా గూఢచారి సంస్థ. డిసెంబర్ నాటికి 10 వేల మంది సైన్యాన్ని రష్యా తరలించాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు ప్యాంగ్ యాంగ్ ప్లాన్ అని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ చీఫ్ చావోతాయ్ యంగ్ చెప్పారు. దీంతో పాటూ ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా 13వేల ఆయుధాలను రష్యా పంపిందని చెప్పారు. ఇది కూడా చదవండి: ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి గిఫ్ట్.. కేబినెట్ కీలక నిర్ణయాలు! ఇది కూడా చదవండి: AP: టెన్త్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షా విధానంలో మార్పులు! 1500 మందితో కూడిన ఉత్తరకొరియా ప్రత్యేక బలగాలు యుద్ధ నౌకల్లో రష్యాలోని వ్లాదివోస్తోక్ రేవు నగరాన్ని చేరుకున్నాయని దక్షిణ కొరియా నిఘా సంస్థ తెలిపింది. త్వరలో మరిన్ని బలగాలు అక్కడికి వెళతాయని కూడా చెబుతోంది. వెళ్ళిన వారందరికీ నకిలీ గుర్తింపు పత్రాలను రష్యా అందించిందని..వారికి రష్యా సైనిక యూనిఫామ్‌లు, ఆయధాలను ఇచ్చారని తెలుస్తోంది . ప్రస్తుత యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఉత్తర కొరియా సైన్యానికి శిక్షణ ఇచ్చి...ఆ తరువాత యుద్ధంలో దించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఉత్తర కొరియా బలగాల విషయం రష్యా మాత్రం ఒప్పుకోవడం లేదు. తాము ఏ దేశ సైన్యాన్ని తెచ్చుకోలేదని చెప్పారు రష్యా అధ్యక్ష భవన అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్. Also Read: నాంపల్లి స్పెషల్ కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చిన కేటీఆర్.. ఏమన్నారంటే ? Also Read: ఏపీలో మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. రూ.99కే క్వార్టర్ అమ్మకాలు షురూ! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి